News January 11, 2025
MBNR: కొత్త రేషన్ కార్డులు.. చిగురించిన ఆశలు

సీఎం రేవంత్ రెడ్డి కలెక్టర్లతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ నెల 26 నుంచి కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఎన్నో ఏళ్లుగా కార్డుల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల్లో ఆశలు చిగురించాయి. ఉమ్మడి జిల్లాలో MBNR-30,345, GDWL-13,189, NGKL-28,773, NRPT-9,391, WNP-11,501 కలిపి మొత్తం 93,199 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఉమ్మడి పాలమూరులో మొత్తం 9,26,636 రేషన్ కార్డులు ఉన్నాయి.
Similar News
News December 4, 2025
MBNR: పొగమంచు సమయంలో జాగ్రత్తలే రక్షణ–ఎస్పీ

చలికాలం ప్రారంభమై జిల్లా వ్యాప్తంగా ఉదయం,రాత్రి వేళల్లో పొగమంచు తీవ్రంగా ఏర్పడుతున్న నేపథ్యంలో రోడ్లపై దృష్టి తగ్గడం, ముందున్న వాహనాల దూరం అంచనా కష్టపడడం వంటి ప్రమాదాలు పెరిగే అవకాశం ఉన్నందున, ప్రమాదాలు నివారించడం కోసం డ్రైవర్లు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని జిల్లా ఎస్పీ డి.జానకి సూచించారు. పొగమంచు వలన రోడ్డు, సిగ్నల్స్, వాహనాలు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరగవచ్చని పేర్కొన్నారు.
News December 4, 2025
MBNR: ఉద్యోగులు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే.. వేటు..!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల సందడి మొదలైంది. 3 విడుదల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ కఠిన నిబంధనలు జారీ చేసింది. ప్రభుత్వ గౌరవ వేతనం పొందుతున్న ఉద్యోగులు సర్పంచ్, వార్డు ఎన్నికల్లో పోటీ చేయాలంటే ముందుగా రాజీనామా చేయాలని స్పష్టం చేసింది. అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధి హామీ పథకం సిబ్బంది, గోపాలమిత్రాలు, సీసీలు వంటి వర్గాలు ఏ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న ఉద్యోగం పోతుంది. జాగ్రత్త సుమా..!
News December 4, 2025
MBNR: స్థానిక సంస్థలు ఫేజ్-3 మొదటి రోజు 81 నామినేషన్లు

స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా పేజ్ 3 మొదటి రోజున 81 నామినేషన్లు వచ్చినట్టు అధికారులు వెల్లడించారు. మూడో విడుదల భాగంగా అడ్డాకుల మండలంలోని 17 గ్రామాల నుంచి ఆరు నామినేషన్లు, బాలానగర్ మండలంలోని 37 గ్రామాల నుంచి 22 నామినేషన్లు, భూత్పూర్ మండలంలోని 19 గ్రామాల నుంచి 17 నామినేషన్లు, జడ్చర్లలోని 45 గ్రామాల నుంచి 25 నామినేషన్లు, మూసాపేటలోని 15 గ్రామాల నుంచి 11 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు తెలిపారు.


