News November 5, 2024
MBNR: కొత్త రేషన్ కార్డులు.. వచ్చేనా?

MBNR:ప్రభుత్వం అందిస్తున్న అనేక పథకాలకు రేషన్ కార్డు దారులే అర్హులు.జిల్లాలో 506 చౌకధర దుకాణాలు ఉన్నాయి. మొత్తం రేషన్ కార్డులు 2,39,600,ఇందులో ఆహార భద్రత కార్డులు 2,20,283,అంత్యోదయ కార్డులు 19,016,అన్నపూర్ణ కార్డులు 201 ఉన్నాయి.BRS ప్రభుత్వం 2021లో కొన్ని రేషన్ కార్డులు పంపిణీ చేసింది. ఆ తర్వాత రేషన్ కార్డుల ఊసే లేదు. ఉత్తర్వులు రాగానే చర్యలు చేపడతామని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.
Similar News
News December 11, 2025
MBNR: మల్లేపల్లిలో బీఆర్ఎస్ మద్దతుదారు లింగం గెలుపు

మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని మల్లేపల్లి గ్రామంలో సర్పంచ్ తొలి ఫలితం వెలువడింది. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ మద్దతుదారు లింగం 364 ఓట్ల మెజారిటీతో మరో అభ్యర్థి కావలి భాస్కర్పై గెలుపొందారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలవడంతో గ్రామంలో సంబరాలు చేసుకుంటున్నారు. పలువురు లింగంకు అభినందనలు తెలిపారు.
News December 11, 2025
MBNR: 11 గంటల వరకు 56.63%.. మరికొద్ది నిమిషాలే టైం..!

మహబూబ్నగర్ జిల్లాలోని స్థానిక సంస్థల మొదటి దశ ఎన్నికల సందర్భంగా ఉదయం 11 గంటల సమయానికి 56.63% పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ సమయం ముగిసేందుకు మరికొద్ది సేపు మాత్రమే ఉండటంతో ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రానికి తరలివస్తున్నారు. ప్రజలు తప్పనిసరిగా బాధ్యతాయుతంగా వ్యవహరించి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
News December 11, 2025
మహబూబ్నగర్: పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సేవలు

మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తంగా మొదటి దేశ పోలింగ్ సందర్భంగా 139 గ్రామపంచాయతీలలో పోలికొనసాగుతోంది. ఆయా గ్రామపంచాయతీలలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆశా కార్యకర్తలను ఏర్పాటు చేశారు. ఓటు వేసేందుకు వచ్చిన వారు ఎవరైనా అనారోగ్యానికి గురైనట్లయితే వెంటనే వారికి అక్కడే వైద్యం అందు విధంగా చర్యలు తీసుకున్నారు. అలాగే వారికి అక్కడికక్కడే అందించేందుకు అన్ని రకాల టాబ్లెట్లను సిద్ధంగా ఉంచారు.


