News July 2, 2024
MBNR: కోయిల్ సాగర్ను పరిశీలించిన కలెక్టర్..!

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ఆనకట్ట ను కలెక్టర్ విజయేందిర సోమవారం సందర్శించారు. డ్యాం పరివాహక ప్రాంతం, డ్యాం నిండితే ప్లడ్ వాటర్ ఏ మేరకు ప్రవహిస్తుంది, కుడి, ఎడమ కాల్వల ద్వారా ఎంత ఆయకట్టుకు సాగు నీరు అందుతుందనే వివరాలు ఇరిగేషన్ అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఇరిగేషన్ డిప్యూటీ ఈఈ కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు.
Similar News
News October 22, 2025
మయూర వాహనంపై ఊరేగిన కురుమూర్తి రాయుడు

కురుమూర్తిస్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అయితే బుధవారం స్వామిని పల్లకి సేవలో మయూర వాహనంపై భక్తులు ఊరేగించారు. స్వామి వారి ఆలయం నుంచి మెట్ల దారిలో భక్తులు గోవిందా, గోవిందా అంటూ భక్తితో గోవింద నామస్మరణలతో స్వామి వారిని ఊరేగించి తరించారు. ఆలయ ఛైర్మన్ గౌని గోవర్ధన్ రెడ్డి, కార్యనిర్వహణ అధికారి సి.మదనేశ్వర్ రెడ్డి, ధర్మకర్తల మండలి సభ్యులు, పలువురు పాల్గొన్నారు.
News October 22, 2025
నవాబు పేట్: కరెంట్ షాక్తో డ్రైవర్ మృతి

మండలంలోని యన్మన్గండ్లకు చెందిన జగదీశ్ (28) బుధవారం విద్యుత్ షాక్తో మృతి చెందాడు. ఓ రైతు పొలంలోకి నర్సరీ చెట్లను తీసుకెళ్తుండగా కంచెలోని విద్యుత్ వైర్లను తప్పించే క్రమంలో ప్రమాదవశాత్తూ షాక్ తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతుడితో ఉన్న నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. జగదీశ్ బులెరో నడుపుతూ జీవనం సాగించేవాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
News October 22, 2025
కన్నుల పండువగా కురుమూర్తి స్వామి కళ్యాణ మహోత్సవం

శ్రీ కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బుధవారం స్వామివారి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఎంతో కమనీయంగా జరిగింది. వేద పండితులు, అర్చకుల మంత్రోచ్ఛారణ మధ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. కురుమూర్తి స్వామి గిరులు “కురుమూర్తి వాసా గోవింద” నామ స్మరణతో మార్మోగాయి.