News September 29, 2024
MBNR: గణనాథుడి లడ్డూ కైవసం చేసుకున్న ముస్లిం సోదరుడు

అచ్చంపేట మండలం నడింపల్లిలో గణనాథుడి లడ్డూను ముస్లిం సోదరుడైన ఎండీ. మోదీన్ కైవసం చేసుకున్నారు. కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. 21 రోజుల పాటు పూజలందుకున్న వినాయక లడ్డూను శనివారం రాత్రి నిర్వహించిన వేలం పాటలో రూ.40,116కు మోదీన్ సొంతం చేసుకున్నాడని తెలిపారు. అతని కుటుంబానికి ఆ గణనాథుని ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటాయని, వినాయకుడి కృపతో అష్ట ఐశ్వర్యాలు, సుఖఃసంతోషాలు కలగాలని కమిటీ తరఫున కోరుకోవడం జరిగిందన్నారు.
Similar News
News October 30, 2025
‘జనాభా ప్రాతిపదికన బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలి’

రాష్ట్రంలో బీసీల జనాభా ప్రాతిపదికన వారికి కేటాయించాల్సిన 42 శాతం రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలని పాలమూరు విశ్వవిద్యాలయం బీసీ అధ్యాపకులు డిమాండ్ చేశారు. గురువారం రిజర్వేషన్ల అంశంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి చిరంజీవులు సమక్షంలో చర్చా సమావేశం నిర్వహించారు. బీసీల రిజర్వేషన్లు న్యాయపరమైనవని, ప్రభుత్వం తక్షణమే స్పందించి అమలు చేయాలని కోరారు. విశ్రాంత చీఫ్ జస్టిస్ ఈశ్వరయ్య కార్యక్రమంలో పాల్గొన్నారు.
News October 30, 2025
MBNR: ‘బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్చాలి’

పాలమూరు విశ్వవిద్యాలయం పీజీ కళాశాలలో గురువారం జరిగిన బీసీల కార్యాచరణ సభకు ఎస్సీ, ఎస్టీ సెల్ డైరెక్టర్ డాక్టర్ కుమారస్వామి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బీసీల హక్కులు, సామాజిక న్యాయం కోసం ప్రభుత్వం తీసుకున్న బీసీ రిజర్వేషన్ల బిల్లుకు చట్టబద్ధత కల్పించేందుకు దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.
News October 30, 2025
PU: ‘ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలి’

విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని పీయూ ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు బత్తిని రాము డిమాండ్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు రూ. 4 వేల కోట్లు బకాయిలు ఉన్నాయని, వాటిని విడతలవారీగా విడుదల చేసి పేద విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ గురువారం పాలమూరు విశ్వవిద్యాలయం ముఖద్వారం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు శేఖర్ పాల్గొన్నారు.


