News October 8, 2024

MBNR: గణనీయంగా పెరిగిన BSNL.. త్వరలో 4G టవర్స్

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 19 లక్షల చరవాణి, 6వేల వరకు FTTH కలెక్షన్లు ఉన్నాయి. జూలైలో 11,305, ఆగస్టులో 12,718 మంది కొత్తగా BSNL సిమ్ కార్డులు కొనుగోలు చేశారు. గత 3 నెలల నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 108 ప్రాంతాల్లో 4G టవర్లు ఏర్పాటు చేశామని, ఇంకా 60 4G టవర్లు అందుబాటులో తీసుకొస్తామని డీజీఎం వెంకటేశ్వర్లు తెలిపారు.

Similar News

News December 21, 2025

MBNR: సైబర్‌ మోసం జరిగితే ‘మొదటి గంట’ కీలకం: ఎస్పీ

image

సైబర్‌ నేరగాళ్ల బారిన పడి డబ్బు కోల్పోతే.. బాధితులు మొదటి గంటలో (గోల్డెన్‌ అవర్‌) ఫిర్యాదు చేయడం అత్యంత కీలకమని ఎస్పీ డి.జానకి పేర్కొన్నారు. త్వరగా స్పందిస్తే పోగొట్టుకున్న సొమ్మును తిరిగి పొందే అవకాశం ఉంటుందన్నారు. ఈ సందర్భంగా సైబర్‌ కేసుల విచారణలో ప్రతిభ చాటిన జిల్లా D4C సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.

News December 21, 2025

MBNR: లోక్ అదాలత్‌.. రూ.16,96,579 రికవరీ

image

మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో సైబర్ నేరాల బాధితులకు గణనీయమైన ఉపశమనం లభించింది. జిల్లా పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించిన సైబర్ క్రైమ్ కేసుల్లో మొత్తం రూ.16,96,579 రికవరీకి సంబంధించి 77 కేసులు పరిష్కరించినట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. జాతీయ లోక్ అదాలత్ ద్వారా సైబర్ నేరాల బాధితులకు త్వరిత న్యాయం లభించడం ఎంతో ప్రయోజనకరమని పేర్కొన్నారు.

News December 21, 2025

MBNR: న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల నిఘా: ఎస్పీ

image

నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో MBNR జిల్లాలో పటిష్ట భద్రతా చర్యలు చేపడుతున్నట్లు ఎస్పీ డి.జానకి తెలిపారు. శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీసులు క్షేత్రస్థాయిలో నిఘా పెంచినట్లు పేర్కొన్నారు. “వేడుకలు జరుపుకోవడం అందరి హక్కే.. కానీ ఆ ఆనందం ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు” అని ఆమె స్పష్టం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపినా, బహిరంగ ప్రదేశాల్లో న్యూసెన్స్ చేసినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.