News April 10, 2025
MBNR: గిరిజన గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తులు

గిరిజన గురుకుల స్కూల్స్ ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్సీఓ కల్యాణి తెలిపారు. 2025-26 విద్యా సం.నికి గానూ MBNR రీజన్‌లోని మన్ననూర్ బాయ్స్, అచ్చంపేట గర్ల్స్ గిరిజన రెసిడెన్షియల్ హాస్టల్స్ ఇంగ్లీష్ మీడియంలో 3వ క్లాస్ 80, 5వ క్లాస్ 80, అలాగే 4-9 క్లాస్‌లలో 152 బ్యాక్ లాగ్ ఖాళీలున్నట్లు తెలిపారు. అర్హులైన PVTG గిరిజన స్టూడెంట్స్ రేపటి నుంచి ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలి.
Similar News
News September 13, 2025
ఆదర్శ ఎస్పీగా పేరుగాంచిన సతీష్ కుమార్

గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ బదిలీ అయ్యారు. ఆయనను సత్యసాయి జిల్లాకు ఎస్పీగా నియమించారు. తన పదవీకాలంలో గుంటూరు జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో విశేష ఫలితాలు సాధించారు. గ్యాంగ్స్టర్లపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు సైబర్ క్రైమ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. యువతలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముందుండి పనిచేశారు. ఆదర్శ ఎస్పీగా గుర్తింపు పొందారు.
News September 13, 2025
గుంటూరు: పిడుగుపాటుకు గురై మహిళా కూలీల మృతి

గుంటూరు జిల్లాలో పిడుగుపాటుకు గురై ఇవాళ ఒక్కరోజే నలుగురు మహిళలు మృతి చెందారు. పెదకాకాని మండలం నంబూరులో పొలం పనులకు వెళ్లిన మహిళా కూలీలపై పిడుగు పడింది. ఈ దుర్ఘటనలో దాసరి రాణి( 41), దాసరి సారమ్మ (39)అక్కడికక్కడే మృతి చెందారు. పెదనందిపాడు(M) అన్నపర్రులో పొలం పనులు ముగించుకుని వస్తుండగా పిడుగు పడి దేవరపల్లి సామ్రాజ్యం, తన్నీరు నాగమ్మ చనిపోయారు. దీంతో ఆయా కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.
News September 13, 2025
తిరుమలలో టీటీడీ ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమలలోని పలు ప్రాంతాల్లో శనివారం టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా కమాండ్ కంట్రోల్ రూమ్‌ను పరిశీలించిన ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి భక్తులకు మెరుగైన సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. రోజు రోజుకూ మారుతున్న టెక్నాలజీని అనుసరించి నూతన సాఫ్ట్వేర్, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించాలని అధికారులకు సూచించారు.