News March 28, 2025

MBNR: గుడ్ న్యూస్ ఉగాదికి సన్నబియ్యం

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి సన్న బియ్యం పంపిణీ చేసేందుకు పౌర శాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 9.21 లక్షల కార్డులు ఉన్నాయి. ఇప్పటికే రేషన్ దుకాణాల్లో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం పై అధికారులు ప్రత్యేక ఫోకస్ పెట్టారు. వాటిని మొత్తం వెనక్కి పంపించాలని ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి సన్నబియ్యం పంపిణీ ఉగాది రోజు ప్రారంభించనున్నారు.

Similar News

News November 22, 2025

గ్రీన్ ఫీల్డ్ హైవేలో పరిహారం చెల్లింపుల్లో గందరగోళం..!

image

గ్రీన్‌ఫీల్డ్ హైవే కోసం భూములు కోల్పోతున్న రైతులు పరిహారం పూర్తిగా రాకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సంగెం, నెక్కొండ, గీసుగొండ, పర్వతగిరి మండలాల్లో వేలాది ఎకరాలు ప్రాజెక్ట్‌లో పోయినా, కొంతమంది రైతులకు మాత్రమే పరిహారం జమ అయింది. భూములు పాస్‌పుస్తకాల నుంచి తొలగించడంతో రైతుభరోసా కూడా అందక రైతులు కుంగిపోతున్నారు. పంటలు వేయొద్దని అధికారులు చెప్పడంతో జీవనోపాధి సందిగ్ధంలో పడిందని రైతులు వాపోతున్నారు.

News November 22, 2025

పాక్‌ ప్లాన్‌ను తిప్పికొట్టిన భారత్-అఫ్గాన్

image

ఇండియా, అఫ్గాన్ మధ్య దౌత్యమే కాకుండా వాణిజ్య సంబంధాలు కూడా బలపడుతున్న విషయం తెలిసిందే. దీనిని తట్టుకోలేని పాకిస్థాన్ వారి రోడ్డు మార్గాన్ని వాడుకోకుండా అఫ్గాన్‌కు ఆంక్షలు విధించింది. పాక్ ఎత్తుగడకు భారత్ చెక్ పెట్టింది. అఫ్గాన్ నుంచి సరుకు రవాణాకు ప్రత్యామ్నాయంగా జల, వాయు మార్గాలను ఎంచుకుంది. ఇరాన్ చాబహార్ పోర్టు నుంచి జల రవాణా, కాబుల్ నుంచి ఢిల్లీ, అమృత్‌సర్‌కు కార్గో రూట్లను ప్రారంభించింది.

News November 22, 2025

పార్వతీపురం: ఈ బిల్డింగ్ నిజంగా కొత్తదేనా?

image

పార్వతీపురం వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన భూసార పరీక్ష కేంద్రాన్ని మంత్రులు కింజరాపు అచ్చెన్నాయుడు, గుమ్మిడి సంధ్యారాణితోపాటు MLAలు <<18354280>>ప్రారంభించారు<<>>. అయితే ఆ భవనం గురించి స్థానికంగా చర్చ నడుస్తోంది. అదే భవనానికి ఆనుకుని పక్కన ఉన్న భవనం శిథిలంగా ఉంది. నిన్న ప్రారంభించిన భవనానికి పెయింట్లు వేసినట్లు ఫొటోలో స్పష్టంగా కనిపిస్తోంది. దీనిపై అధికార యంత్రాంగం స్పందించాల్సి ఉంది.