News February 6, 2025
MBNR: గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.
Similar News
News September 19, 2025
ఖమ్మం: సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించిన కలెక్టర్

రాపర్తి నగర్లోని TGMRJC బాలికల జూనియర్ కళాశాలలో నిట్, ఐఐటీ ఆశావహ విద్యార్థినుల కోసం ఏర్పాటు చేసిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ప్రారంభించారు. లైబ్రరీ, తరగతి గదులను పరిశీలించిన కలెక్టర్, విద్యార్థినులు, తల్లిదండ్రులతో ఆత్మీయంగా మాట్లాడి తన అనుభవాలను పంచుకున్నారు. ఇంటర్లో కృషి చేస్తే మంచి కెరీర్ సాధ్యమని, పోటీ పరీక్షల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు.
News September 19, 2025
భార్యను హత్య చేసిన భర్త అరెస్ట్: పరవాడ సీఐ

పరవాడ మండలం జలారిపేటలో ఈనెల 17న భార్యను కత్తితో పొడిచి చంపిన ఘటనలో భర్త ఒలిశెట్టి కొండను గురువారం అరెస్టు చేసినట్లు సీఐ మల్లికార్జునరావు తెలిపారు. నిందితుడు పరవాడ మండలం వెన్నెలపాలెంలో సంచరిస్తున్నాడని సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లి పట్టుకున్నారు. అనంతరం అనకాపల్లి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు.
News September 19, 2025
VJA: దుర్గగుడి ఛైర్మన్ నియామకంపై తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

దుర్గగుడి ట్రస్ట్ బోర్డ్ ఛైర్మన్గా బాలకృష్ణ అభిమాని బొర్రా గాంధీని నియమించడంపై స్థానిక TDP నాయకులు అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం. YCP పాలనలో కేసులను ఎదుర్కొని, పార్టీ కోసం కష్టపడిన కీలక నేతలకు పదవి దక్కుతుందని ఆశించారు. అయితే, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా లేని గాంధీకి బాలకృష్ణ సిఫార్సుతోనే పదవి లభించిందని జిల్లా TDP నేతలు తీవ్రంగా చర్చించుకుంటున్నారు.