News February 6, 2025
MBNR: గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.
Similar News
News December 6, 2025
విమాన టికెట్ ధరలు పెంచకూడదు: కేంద్ర మంత్రి

విమానయాన రంగంలో ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితిని చక్కదిద్దేందుకు శ్రీకాకుళం ఎంపీ, కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ, డీజీసీఏ అధికారులతో కలిసి ఇండిగో సంస్థ కార్యకలాపాలను సమీక్షించారు. ఇండిగో సంస్థ తమ సేవలను వీలైనంత త్వరగా సాధారణ స్థితికి తెచ్చుకోవాలని, టికెట్ ఛార్జీలను పెంచరాదని మంత్రి ఆదేశించారు.
News December 6, 2025
అనంత: చలిమంట కాచుకుంటూ వ్యక్తి మృతి

డి.హిరేహాల్ మండల కేంద్రంలో చలిమంట కాచుకుంటూ ప్రమాదవశాత్తు మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఎస్ఐ గురుప్రసాద్ రెడ్డి వివరాల మేరకు.. గ్రామానికి చెందిన సిద్దేశ్ గత నెల 30న చలిమంట కాచుకుంటూ ఉండగా మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బళ్లారి విమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు.
News December 6, 2025
ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు చేయాలి: కలెక్టర్ ప్రతీక్ జైన్

గ్రామ పంచాయతీ ఎన్నికలను ఎన్నికల నియమావళిని పాటిస్తూ సరైన విధంగా నిర్వహించాలని అధికారులను వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టరేట్లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నాయని, ఈ మూడు దశలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళి(కోడ్) అమలులో ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు.


