News February 6, 2025
MBNR: గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.
Similar News
News November 27, 2025
HYD: ‘మహిళలు ధైర్యంగా ఫిర్యాదు చేయండి’

మహిళల భద్రతే తమ లక్ష్యమని రాచకొండ సీపీ సుధీర్ బాబు అన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 15 రోజుల్లో మహిళలను వేధించిన 110 మంది వ్యక్తులను పట్టుకున్నామన్నారు. మహిళలకు ఎవరు ఇబ్బంది కలిగించినా నిర్భయంగా ఫిర్యాదు చేయాలని, వేధింపులకు పాల్పడిన వారిని ఆధారాలతో కోర్టుకు హాజరు పరుస్తూ.. తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు.
News November 27, 2025
NRPT: నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత

ఎన్నికల నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా.వినీత్ తెలిపారు. కేంద్రాల చుట్టూ 100 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఆయన గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నామినేషన్ల ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఎస్పీ చెప్పారు.
News November 27, 2025
మల్లాపూర్: నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్

మల్లాపూర్ మండలం గొర్రెపల్లి, సాతారం, మొగిలిపేట, రాఘవపేట, కుస్తాపూర్, కొత్త దామరాజ్ పల్లి గ్రామాలలో ఏర్పాటుచేసిన నామినేషన్ కేంద్రాలను గురువారం అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్ పరిశీలించారు. నోటీస్ బోర్డులపై అతికించిన నోటిఫికేషన్ పత్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా నామినేషన్ల ప్రక్రియను నిర్వహించాలన్నారు. నామినేషన్ దరఖాస్తు ఫారాలు తీసుకున్న వారి వివరాలను కూడా రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు.


