News February 6, 2025
MBNR: గురుకులంలో టెన్త్ విద్యార్థిని ఆత్మహత్య

బాలానగర్ మండల కేంద్రంలోని బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. కల్వకుర్తికి చెందిన ఆరాధ్య (16) పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. ఈరోజు ఉదయం తన గదిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన పాఠశాలలోని విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారమిచ్చారు. విద్యార్థినిని టీచర్లు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతిచెందినట్లు వైద్యలు నిర్ధారించారు.
Similar News
News January 23, 2026
సిట్ విచారణకు వెళ్లే ముందు KTR ప్రెస్ మీట్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి, BRS కీలక నేత KTR నేడు ఉదయం 11 గంటలకు సిట్ విచారణకు హాజరుకానున్నారు. అంతకుముందు 9:30 గంటలకు ఆయన తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతలతో సమావేశం అనంతరం 10 గంటలకు ప్రెస్‌మీట్ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఇదే కేసులో మరో కీలక నేత హరీశ్‌రావును ఇటీవలే సిట్ విచారించిన విషయం తెలిసిందే.
News January 23, 2026
మంచిర్యాల వరకే భాగ్యనగర్, ఇంటర్‌సిటీ రైళ్లు

సిర్పూర్ కాగజ్‌నగర్ – సికింద్రాబాద్ మధ్య నడిచే పలు రైళ్లపై ఎన్‌ఐ (Non-Interlocking) పనుల ప్రభావం పడింది. ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14 వరకు భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్ (17233/17234), ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ (17011/17012) రైళ్లు మంచిర్యాల వరకే నడుస్తాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మంచిర్యాల – కాగజ్‌నగర్ మధ్య ఈ రైళ్లు పాక్షికంగా రద్దు కానున్నాయి. ప్రయాణికులు ఈ మార్పును గమనించాలని అధికారులు కోరారు.
News January 23, 2026
శీతాకాలంలో పసిపిల్లల సంరక్షణ

శీతాకాలంలో నవజాత శిశువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బిడ్డకు ఎప్పుడూ వెచ్చగా ఉండే దుస్తులు వేయాలి. సమయానికి తల్లిపాలు ఇవ్వడం చాలా ముఖ్యం. ఉదయం స్నానం చేయించిన తర్వాత బిడ్డను కాసేపు ఎండలో కూర్చోనివ్వాలి. చల్లని గాలి పడకుండా చూడాలి. ఫ్యాన్ లేదా ఏసీకి దూరంగా ఉంచాలి. ఏవైనా ఆరోగ్య సమస్యల లక్షణాలు కనిపిస్తే ఇంట్లో మందులు వేసి సొంత వైద్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి.


