News July 25, 2024
MBNR: గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు
రాష్ట్రంలోని గురుకుల కళాశాలలో ఖాళీల భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు TGSWREI సొసైటీ కార్యదర్శి అలుగు వర్షిని తెలిపారు. ఉమ్మడి పాలమూరులోని ఆయా గురుకుల సెంటర్లల్లో ఈనెల 26న బాలికలకు, 27న బాలురకు మిగిలిన ఖాళీల్లో ఇంటర్, ఒకేషనల్ గ్రూపుల్లో భర్తీకి స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు వివరించారు. 2024 మార్చిలో టెన్త్ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలన్నారు.
SHARE IT..
Similar News
News November 29, 2024
MBNR: రోడ్ల నిర్మాణానికై కేంద్ర మంత్రికి ఎంపీ అరుణ వినతి
మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ శుక్రవారం ఢిల్లీలో కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ పరిధిలోని పలు జాతీయ రహదారుల అనుసంధానం, సింగిల్ నుంచి డబుల్, డబుల్ నుంచి 4 లేన్స్, 6లేన్స్ రోడ్ల నిర్మాణానికి ప్రతి పాదనలతో ఉన్న వినతులను కేంద్రమంత్రికి అందించారు. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారని ఎంపీ తెలిపింది.
News November 29, 2024
రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా: హరీశ్ రావు
సిద్దిపేటలో నిర్వహించిన దీక్షా దివాస్లో సీఎం రేవంత్ పై హరీశ్ రావు మండిపడ్డారు. ‘రేవంత్ ఏనాడైనా జై తెలంగాణ అన్నాడా, ఇచ్చిన తెలంగాణ ప్రకటనను కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తీసుకున్నప్పుడు ఉద్యమం ఉవ్వెత్తున మొదలైంది. అప్పుడు ఎమ్మెల్యేలంతా రాజీనామా చేయాలని తెలంగాణ ప్రజలు డిమాండ్ చేస్తే రేవంత్ పారిపోయిండు. రేవంత్ మీద ఉద్యమ కేసులు లేవు కానీ.. ఓటుకు నోటు కేసు మాత్రం నమోదైంది’ అని హరీశ్ రావు అన్నారు.
News November 29, 2024
నాగర్ కర్నూల్: మధ్యాహ్న భోజనం తిని నలుగురు విద్యార్థుల అస్వస్థత
మరో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం రేపింది. స్థానికులు తెలిపిన వివరాలు.. నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలంలోని గోరిట ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని శుక్రవారం నలుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. టమాటా రైస్, గుడ్డు తిన్న నలుగురు విద్యార్థులు వాంతులు చేసుకోవడంతో వెంటనే స్పందించిన ఉపాధ్యాయులు వైద్యులను పాఠశాలకు పిలిపించి అక్కడే చికిత్స అందించారు. ఈఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.