News March 30, 2024
MBNR: గురుకుల కళాశాలలో 2,160 సీట్లు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో బాలుర గురుకుల కళాశాలలు 12, బాలికల గురుకుల కళాశాలలు 13 వంతున మొత్తం 25 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. ఈ కళాశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, హెచ్ఎసీ, ఎంఈసీ, వృత్తి విద్యా కోర్సులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో బాలురకు 1,040, బాలికలకు 1,120 సీట్లు ఉన్నాయి. BCలకు 75%, SCలకు 15%, STలకు 5%, OC/EBCలకు 2%, అనాథలకు 3% సీట్లు కేటాయించారు.
Similar News
News January 24, 2025
పాలమూరు ఎత్తిపోతలకు పీఆర్ఎల్ఐ పథకంగా నామకరణం
పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కేంద్ర మాజీ మంత్రి ఎస్. జైపాల్ రెడ్డి పీఆర్ఎల్ఐ పథకంగా పేరు పెడుతూ.. నీటిపారుదల శాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ పథకానికి జైపాల్ రెడ్డి పేరు పెట్టడంతో ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేశారు.
News January 24, 2025
హన్వాడ: మహిళ అదృశ్యం.. కేసు నమోదు
ఓ మహిళ అదృశ్యమైన ఘటన మండలంలో జరిగింది. ఎస్ఐ వెంకటేశ్ వివరాల ప్రకారం.. మండలంలోని కొనగట్టుపల్లి గ్రామానికి చెందిన రావుల చెన్నమ్మ (30) ఈనెల 17న పనికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. ఇప్పటివరకు ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదు. బాధితురాలు తల్లి జంగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News January 23, 2025
జడ్చర్ల: అందరికీ ఇల్లు, రేషన్ కార్డులు వస్తాయి: ఎమ్మెల్యే
జడ్చర్ల మండలంలోని నసురుల్లాబాద్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరులో ఏ ఒక్క పేదవాడికి అన్యాయం జరిగినా తాను సహించేది లేదని ఎమ్మెల్యే జనంపల్లి అనిరుధ్ రెడ్డి హెచ్చరించారు. అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికీ ఇళ్లు, రేషన్ కార్డులు మంజూరయ్యేలా చూసుకోవాల్సిన బాధ్యత ఇందిరమ్మ కమిటీ సభ్యులు, అధికారులదేనని స్పష్టం చేశారు.