News February 7, 2025

MBNR: గురుకుల పాఠశాలను సందర్శించిన కలెక్టర్

image

బాలానగర్ మండల కేంద్రంలోని జనరల్ గురుకుల బాలికల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆరాధ్య మృతి చెందిన సంగతి తెలిసిందే. గురువారం మధ్యాహ్నం కలెక్టర్ విజయేందిర బోయి సందర్శించారు. ఆరాధ్య తల్లిదండ్రులను పరామర్శించి, ఓదార్చారు. ఆరాధ్య మృతికి సంబంధించి విద్యార్థులను ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్, డీఎస్పీ వెంకటేశ్వర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Similar News

News November 26, 2025

NLG: సర్పంచ్ ఎన్నికలలో వారిని దింపేందుకు ఫోకస్..!

image

ఎన్నికల కోసం ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న ఆశావహుల ఉత్కంఠకు తెరపడింది. ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ వెలువడడంతో బలమైన అభ్యర్థులను రంగంలోకి దింపేందుకు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP దృష్టి సారించాయి. ఆర్థికంగా బలంగా ఉన్న వారితోపాటు, పలుకుబడి ఉన్న వారిని గుర్తించి మద్దతు ఇచ్చే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తుంది. జిల్లాలో మొదటి విడతలో 318, 2వ విడతలో 282, 3వ విడతలో 269 జీపీలకు పోలింగ్ జరగనుంది.

News November 26, 2025

మంగపేటలో 15 ఏళ్లుగా ఎన్నికలు లేవు!

image

ములుగు జిల్లాలోని మంగపేట మండలానికి 15 ఏళ్లుగా ఓటు వేసే హక్కు లేకుండా పోయింది. 2011 నుంచి సర్పంచ్, ఎంపీటీసీ, ఇతర ఎన్నికలు లేకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలన ద్వారానే గ్రామాల నిర్వహణ కొనసాగుతోంది. గిరిజన, గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ వివాదం కోర్టులో ఉండగా మండలంలోని 23 గ్రామాల్లో సుప్రీంకోర్టు ఎన్నికల నిర్వహణపై స్టే ఇచ్చింది. దీంతో ఈసారి కూడా ఎన్నికలు లేకపోవడంతో గ్రామాల అభివృద్ధి కుంటుపడుతోంది.

News November 26, 2025

ASF: సర్పంచ్ పోటీకి యువత గురి

image

అసెంబ్లీ ఎన్నికల్లో యూత్ పవర్ ఏంటో చూపించాం. సర్పంచ్ ఎన్నికల బరిలో నిలిచి తమ సత్తా చూపిస్తామంటూ ఆసిఫాబాద్ జిల్లా యువత ముందుకొస్తున్నారు. వారితో రాజకీయం ఏమవుతుందని లైట్‌గా తీసుకునే రాజకీయ నేతలకు జరగబోయే పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలనే పట్టుదలతో చాలామంది యూత్ సర్పంచ్లుగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వాంకిడి సర్పంచ్ స్థానానికి పోటీ చేసే ఆశావహుల పేర్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి.