News July 12, 2024
MBNR: గ్రూప్-1 మెయిన్స్‌కు మైనార్టీ అభ్యర్థులకు శిక్షణ

రాష్ట్ర మైనార్టీ స్టడీ సర్కిల్, మైనార్టీ సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ కు ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా ఇన్చార్జి మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆర్.ఇందిర తెలిపారు. హైదరాబాదులో నిర్వహించే ఉచిత శిక్షణకు ఆసక్తి, అర్హత గల మైనార్టీ అభ్యర్థులు ఈ నెల 19వ తేదీ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ల్యాండ్ ఫోన్ నం. 040-23236112ను సంప్రదించాలని పేర్కొన్నారు
Similar News
News February 18, 2025
NRPT: గల్లంతైన తండ్రీకొడుకులు మృతి

బావిలో పడి <<15494116>>గల్లంతైన తండ్రీకొడుకులు<<>> మృతిచెందిన ఘటన దామరగిద్ద మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలిలా.. తన భార్య గ్రామమైన మండల పరిధిలోని మద్దెలబీడులో కర్ణాటకకు చెందిన శివయ్య(35) కుటుంబంతో ఉంటున్నారు. తన కుమారుడు(5) ప్రమాదవశాత్తుబావిలో పడిపోగా.. కాపాడటానికి వెళ్లి తను కూడా మునిగిపోయారు. వారిని సహాయక సిబ్బంది గాలించి మృతదేహాలను వెలికితీశారు. తండ్రీకుమారుల మృతితో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
News February 18, 2025
MBNR: బయోమెట్రిక్ లేకపోతే కఠిన చర్యలు: కలెక్టర్

జిల్లా కలెక్టరేట్లోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది బయోమెట్రిక్ పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి హెచ్చరించారు. సోమవారం తన ఛాంబర్ లో బయోమెట్రిక్ విధానం పై సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరు బయోమెట్రిక్ ను పాటించాల్సిందేనని, అలా కాకుండా గైర్హాజర్ అయితే వారిని సహించేది లేదని ఘాటుగా హెచ్చరించారు. అన్ని శాఖల అధికారులు బయోమెట్రిక్‌పై ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
News February 18, 2025
MBNR: ఐదుగురు డిప్యూటీ తహశీల్దారులు బదిలీ!

జిల్లాలో పనిచేస్తున్న ఐదుగురు డిప్యూటీ తహశీల్దార్లను జిల్లా కలెక్టర్ విజయేంద్రి బోయి బదిలీ చేశారు. జడ్చర్ల డీటీగా పనిచేస్తున్న రాజీవ్ రెడ్డి ని కలెక్టరేట్లోని డీఎస్ఓ డీటీగా నియమించగా, డీఎస్ఓ లో డీటీలుగా పనిచేస్తున్న శ్యాంసుందర్ రెడ్డిని మహబూబ్నగర్ రూరల్ డీటీగా, ఈయనతో పాటు కిషోర్ ని జడ్చర్ల డీటీగా, నావాబ్ పేట డీటీ గాయత్రిని మహబూబ్నగర్ డీటీగా, రూరల్ డీటీ సువర్ణను నవాబ్ పేట్ డీటిగా నియమించారు.