News December 15, 2024
MBNR: గ్రూప్-2 అభ్యర్థులకు కీలక సూచన

ఉమ్మడి పాలమూరు జిల్లాలో G-2 పరీక్షకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. MBNRలో 54 కేంద్రాల్లో 20,584 మంది, NGKLలో 32 కేంద్రాల్లో 9,731, గద్వాలలో 25 కేంద్రాల్లో 8,722, WNPలో 31 కేంద్రాల్లో 8,569, NRPTలో 13 కేంద్రాల్లో 3,994 మంది పరీక్ష రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఆంక్షలు అమలులో ఉంటాయన్నారు. అభ్యర్థులు సమయానికి చేరుకోవాలని, అరగంట ముందే గేట్లు మూసివేస్తామని స్పష్టం చేశారు.
-ALL THE BEST
Similar News
News November 17, 2025
బాలానగర్లో 9.9 ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో చలి తీవ్రత రోజుకు పెరిగిపోతుంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బాలానగర్లో 9.9 డిగ్రీల అత్యంత ఉష్ణోగ్రత నమోదయింది. రాజాపూర్ 10.2, గండీడ్ మండలం సల్కర్ పేట, మిడ్జిల్ 10.5, హన్వాడ 11.3 కోయిలకొండ మండలం సిరి వెంకటాపూర్ 11.4, భూత్పూర్ 11.6, కోయిలకొండ మండలం పారుపల్లి 11.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.
News November 17, 2025
వాహనదారులు జాగ్రత్తగా ఉండాలి: MBNR SP

శీతాకాలంలో వాహనదారులు జాగ్రత్తగా వాహనాలు నడపాలని మహబూబ్ నగర్ SP జానకి సూచించారు. చలికాలంలో పొగ మంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనపడని కారణంగా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందన్నారు. రాత్రి, తెల్లవారుజామున ప్రయాణాలను తగ్గించుకోవడం మంచిదని వివరించారు. బైక్ నడిపై వారు తప్పనిసరిగా హెల్మెట్, చేతులకు గ్లౌజులు ధరించాలన్నారు.
News November 16, 2025
MBNR:U-14..18న వాలీబాల్ ఎంపికలు

మహబూబ్ నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14 విభాగంలో బాల, బాలికలకు వాలీబాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్.శారదాబాయి ‘Way2News’తో తెలిపారు. మహబూబ్ నగర్ నగర్ లోని DSA స్టేడియంలో ఈ నెల 18న ఎంపికలు ఉంటాయని, ఒరిజినల్ బోనఫైడ్, ఆధార్ జిరాక్స్ లతో ఉ.9:00 గంటలలోపు రిపోర్ట్ చేయాలన్నారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
#SHARE IT.


