News March 14, 2025

MBNR: ఘనంగా కామ దహన వేడుకలు (PHOTO)

image

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి కామ దహన వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. కామ దహనం తర్వాతి రోజు ప్రజలు హోలీ పండుగను నిర్వహించుకోనున్నారు. ఉమ్మడి జిల్లాలోని ప్రతి గ్రామంలో చిన్నా, పెద్దా తేడా లేకుండా హోలీ సంబరాలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమయ్యారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగను జరుపుకోనున్నారు.>>HAPPY HOLI

Similar News

News March 15, 2025

MBNR: నేటి నుంచే ఒంటిపూట బడులు..!

image

ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులను నిర్వహించాలని నిర్ణయించింది. ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకు తరగతులు జరగనున్నాయి. ఎగ్జామ్ సెంటర్ పడ్డ స్కూల్స్‌లో మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు జరుగుతాయి. ఏప్రిల్23 వరకు ఈ హాఫ్‌డే స్కూల్స్ ఉంటాయి. ఏప్రిల్24 నుంచి జూన్11 వరకు వేసవి సెలవులు. జూన్12న పాఠశాలలు రీ ఓపెన్.

News March 14, 2025

MBNR: పెళ్లై వారం రోజులే.. అప్పుడే అనంతలోకాలకు!

image

వారం రోజుల క్రితమే పెళ్లైన ఓ <<15754802>>యువకుడు<<>> రోడ్డుప్రమాదంలో మృతిచెందిన ఘటన MBNRలో గురువారం చోటుచేసుకుంది. SI రామ్‌లాల్  నాయక్ వివరాలు.. సీసీకుంట ఫర్డీపూర్‌కు చెందిన రాజు(30) బైక్‌పై లాల్‌కోటకు వెళ్తున్నాడు. మద్యంమత్తులో ఉన్న రమేశ్ బైక్‌పై లాల్‌కోట-ఫర్డీపూర్ వస్తూ రాజు బైక్‌ను ఢీకొట్టగా తీవ్రంగా గాయపడ్డ అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News March 14, 2025

MBNR: రెండు బైకులు ఢీ.. యువకుడు మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన గురువారం సీసీ కుంట మండల పరిధిలో చోటు చేసుకుంది. SI రామ్‌లాల్ నాయక్ వివరాలు.. పార్దిపూర్ గ్రామానికి చెందిన రాజు (31) నిన్న సాయంత్రం బైక్‌పై లాల్ కోట వైపు వెళ్తున్నాడు. పర్దిపూర్ గ్రామ సమీపంలో ఎదురుగా వస్తున్న రమేష్ నాయక్ బైక్ ఎదురుగా వచ్చి బలంగా ఢీ కొనగా రాజు తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమేష్‌కు పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు.

error: Content is protected !!