News January 10, 2025
MBNR: చట్టాలపై అవగాహన పెంచుకోవాలి: సివిల్ జడ్జి
చట్టాలపై అవగాహన పెంచుకుని క్షేత్రస్థాయిలో గ్రామీణ ప్రాంతాల ప్రజలకు న్యాయ సేవలు అందించేందుకు కృషి చేయాలని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి డి.ఇందిర అన్నారు. జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు మనోన్యాయ్ కమిటీ సభ్యులకు నిర్వహించిన రెండు రోజుల శిక్షణ కార్యక్రమంలో మాట్లాడారు. పిల్లల చట్టాలు, బాల కార్మిక వ్యవస్థ, బాల్య వివాహాల నిర్మూలనపై పలు సూచనలు చేశారు.
Similar News
News January 21, 2025
MBNR:BC స్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణ..APPLY చేసుకోండి..!
మహబూబ్ నగర్ బీసీ స్టడీ సర్కిల్లో RRB,SSC, బ్యాంకింగ్ పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు BC స్టడీ సర్కిల్ అభివృద్ధి అధికారిని ఆర్.ఇందిర, డైరెక్టర్ ఎ.స్వప్న తెలిపారు. MBNR,NGKL,NRPT జిల్లాలకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఫిబ్రవరి 9లోగా www.tgbcstudycircle.cgg.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.1500 స్టైఫండ్, బుక్స్ ఇవ్వనున్నారు. సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 21, 2025
MBNR: గ్రామసభలు షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలి: కలెక్టర్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 26 నుంచి ప్రారంభించనున్న 4 సంక్షేమ పథకాల లబ్ధిదారుల గుర్తింపునకు నేటి నుంచి జనవరి 24 వరకు షెడ్యూల్ ప్రకారంగా గ్రామసభల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం మహబూబ్ నగర్ సమీకృత కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.
News January 21, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!
✔గణతంత్ర దినోత్సవం పకడ్బందీగా ఏర్పాటు చేయండి:కలెక్టర్లు
✔వరి సాగు.. రైతన్నలు బిజీబిజీ
✔NRPT:రోడ్డు ప్రమాదం.. ఓ మహిళ మృతి
✔రేపటి నుంచి అన్ని గ్రామాల్లో గ్రామసభలు
✔ముమ్మరంగా రైతు భరోసా సర్వే
✔అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్లు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు