News February 20, 2025
MBNR: చత్రపతి శివాజీ జయంతి వేడుకల్లో ఎంపీ డీకే అరుణ

మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం కొందుర్గ్‌లో శివాజీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా హాజరై ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, బీజేవైఎం శ్రేణులు, శివాజీ యూత్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
Similar News
News March 23, 2025
MBNR: మార్చి 31తో ముగియనున్న ఎస్సీ ఉపకార వేతనాల గడువు

ఎస్సీ ఉపకార వేతనాల కోసం దరఖాస్తు చేసుకునే గడవు మార్చి 31తో ముగియనుందని షెడ్యూలు కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు సుదర్శన్ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఇప్పటివరకు కేవలం 70% మాత్రమే దరఖాస్తులు వచ్చాయని, దరఖాస్తు చేసుకొని వారు నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కళాశాలల ప్రిన్సిపల్‌లను కోరారు. విద్యార్థులు బ్యాంక్ అకౌంట్‌కు ఆధార్ సీడింగ్ చేయించుకోవాలన్నారు.
News March 22, 2025
MBNR: నీటి కోసం మూడేళ్లుగా ఉపాధ్యాయుడి పోరాటం

ఉమ్మడి జిల్లాలోని కోస్గి పట్టణానికి చెందిన ఉపాధ్యాయుడు వీరు మల్లేష్ “WALK FOR WATER’ అనే నినాదంతో ఉమ్మడి జిల్లాలోని ఉన్న పలు ప్రభుత్వ పాఠశాలలో పర్యటిస్తూ.. విద్యార్థులకు నీటి యొక్క ప్రాముఖ్యతను, నీటిని సంరక్షించుకునే విధానాన్ని వివరిస్తూ నీటి ప్రతిజ్ఞ చేయిస్తూ.. గత మూడేళ్లుగా నీరు వృధా కాకుండా ఎలా ఉపయోగించుకోవాలో ప్రజలకు వివరిస్తూనే ఉన్నారు. వరల్డ్ వాటర్ డే సందర్భంగా “Way2News” ప్రత్యేక కథనం.
News March 22, 2025
జడ్చర్ల: ‘విద్యుత్ సరఫరా లేక ఎండుతున్న పంటలు’

జడ్చర్ల మండలం కిష్టారం గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగా లేక నీళ్లు పెట్టకపోవడంతో మొక్కజొన్న, వరి పంటలు ఎండిపోతున్నాయని కిష్టారం గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా Way2Newsతో రైతు పి.వెంకటేశ్ మాట్లాడుతూ.. విద్యుత్ సరఫరా సరిగా లేక వేల పెట్టుబడితో పెట్టిన పంటలు ఎండిపోయి నష్టపోతున్నామని, విద్యుత్ అధికారులు స్పందించి 24 గంటలు కరెంట్ సరఫరా చేయాలని అన్నారు.