News February 3, 2025
MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రెటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.
Similar News
News March 11, 2026
దేవరకద్రలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు

మహబూబ్ నగర్ జిల్లాలో జిల్లాలో ఎండల తీవ్రత పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో దేవరకద్రలో అత్యధికంగా 38.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గండీడు (36.0), భూత్పూర్ (35.7), కోయిలకొండ (35.6) మండలాల్లోనూ ఎండ ప్రభావం అధికంగా ఉంది. చిన్నచింతకుంట, అడ్డాకుల, నవాబుపేట ప్రాంతాల్లో 34 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మార్చిలోనే ఎండలు ముదురుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.
News March 10, 2026
హెచ్‌సీఏ సెక్రటరీగా పాలమూరు వాసి నియామకం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) సెక్రటరీగా పాలమూరు జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత మన్నే జీవన్ రెడ్డి నియమితులయ్యారు. మంగళవారం ఆయన తన నియామక పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను వెలుగులోకి తెచ్చి, తెలంగాణలో క్రికెట్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ప్రకటించారు.
News March 10, 2026
MBNR: డ్రగ్స్ రవాణాపై ఉక్కుపాదం – కలెక్టర్

జిల్లాలో మత్తు పదార్థాల అక్రమ రవాణాను కఠినంగా అరికట్టాలని కలెక్టర్ కుష్బూ గుప్త అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గంజాయి, డ్రగ్స్ వల్ల విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి మత్తు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని సూచించారు.


