News February 3, 2025
MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.
Similar News
News March 14, 2026
సూళ్లూరుపేటలో జువెలరీ షాపులో దోపిడి

సూళ్లూరుపేట పట్టణంలోని కచేరి వీధిలో ఉన్న వెంకటేశ్వర జువెలరీ షాపులో శనివారం మధ్యాహ్నం దోపిడి జరిగింది. కొనుగోలు చేస్తున్నట్లు నటించిన ఓ దుండగుడు షాపు యజమాని కళ్లలో కారం పొడి చల్లి సుమారు రూ.45 లక్షల విలువైన 916 హాల్‌మార్క్ బంగారు నగలను అపహరించి పరారయ్యాడు. ఘటనతో ప్రాంతంలో కలకలం రేగగా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు.
News March 14, 2026
రేపు గాంధీభవన్‌లో ఎర్రబెల్లి స్వర్ణ బాధ్యతల స్వీకరణ

టీజీ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఎర్రబెల్లి స్వర్ణ ఆదివారం ఉ. 10 గం.కు గాంధీభవన్‌లో మొగిలి సునీత రావు నుంచి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి జాతీయ అధ్యక్షురాలు అల్కాలంబ, సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ జనరల్ సెక్రెటరీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు, ప్రజా ప్రతినిధులు హాజరుకానున్నారు.
News March 14, 2026
శ్రీశైలం ఆలయ ప్రవేశ మార్గాల్లో డీఎఫ్ఎండీలు ఉపయోగించాలి: ఎస్పీ

ఆలయం లోపలికి ప్రవేశించు మార్గాలలో తప్పనిసరిగా డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (DFMD )ను ఉపయోగించాలని జిల్లా ఎస్పీ సునీల్ షోరాణ్ ఆదేశించారు. శనివారం బందోబస్తు నిమిత్తం వచ్చిన సిబ్బందికి సూచనలు ఇచ్చారు. సాధారణ భక్తులతో పాటు ఉన్నత స్థాయి అధికారుల వరకు ప్రతి ఒక్కరినీ తనిఖీ చేసి లోపలికి అనుమతించాలన్నారు. శ్రీశైలం పరిసర ప్రాంతాలలో రోడ్డు ఓపెనింగ్ పార్టీ (ROP)లు క్షుణ్ణంగా తనిఖీలు చేయాలన్నారు.


