News February 3, 2025
MBNR: చల్లా వంశీచంద్ రెడ్డికి కీలక పదవి

కల్వకుర్తి కాంగ్రెస్ నేత చల్లా వంశీచంద్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం కీలక పదవి కట్టబెట్టింది. ఎంపవర్డ్ యాక్షన్ గ్రూప్ ఆఫ్ లీడర్స్ అండ్ ఎక్స్‌పర్ట్స్ అనే ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీ kc వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ కమిటీని 8మంది బృంద సభ్యులతో ఏర్పాటు చేయగా తెలంగాణకు చెందిన చల్లా వంశీచంద్ రెడ్డికి చోటు దక్కింది.
Similar News
News February 8, 2026
గారెపల్లిలో లారీ కింద పడి వ్యక్తి దుర్మరణం

గారెపల్లి అంబేడ్కర్ చౌరస్తాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించారు. మృతుడిని ఇప్పలపల్లి గ్రామానికి చెందిన రాజయ్యగా గుర్తించారు. రాజయ్య ఆత్మహత్య చేసుకుందామనే ప్రయత్నంలో ముందుగా ఆర్టీసీ బస్సు కింద పడిపోగా, డ్రైవర్ తప్పించడంతో వెనుక వస్తున్న లారీ కింద పడి మరణించినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎస్ఐ శ్రీనివాస్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News February 8, 2026
‘దోస్తో’ యాప్ ద్వారానే యూరియా విక్రయాలు: డీఏఓ

జిల్లాలో యూరియా అమ్మకాలు ఇకపై యాప్ ద్వారానే సాగాలని డీఏఓ అజయ్ కుమార్ తెలిపారు. అక్రమ విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం ‘దోస్తో’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిందన్నారు. రైతులు ఎరువుల కోసం ఇబ్బంది పడకుండా దుకాణదారులు నిరంతరం స్టాక్ వివరాలను అప్డేట్ చేయాలన్నారు. మండల స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి రైతులకు తోడ్పాటు అందించాలని ఒక ప్రకటనలో కోరారు.
News February 8, 2026
కాకినాడ కొత్త DROగా తిప్పేనాయక్

కాకినాడ DROగా డాక్టర్ తిప్పేనాయక్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన వెంకటరావు సింహాచలం దేవస్థానం ఈఓగా బదిలీ అవ్వడంతో అనంతపురంలో ఉన్న తిప్పేనాయక్ ఇక్కడికి నియమితులయ్యారు. గతంలో 2024లో కూడా ఆయన ఇక్కడే పనిచేశారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను రెవెన్యూ అధికారులు కలిసి అభినందనలు తెలిపారు. జిల్లా అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


