News February 28, 2025
MBNR: చివరి అవకాశం.. నేటితో ముగియనున్న కులగణన సర్వే

మహబూబ్ నగర్ జిల్లాలో నేటితో కులగణన సర్వే ముగియనుంది. గతంలో ప్రభుత్వం సర్వే చేసిన కొందరు వివరాలు నమోదు చేసుకోలేదు. ఇంకా సర్వేలో పాల్గొననివారు, వివరాలు ఇవ్వని వారు వెంటనే సర్వేలో వివరాలు నమోదు అధికారులు సూచించారు. కుల గణనలో పాల్గొనని వారికి ప్రభుత్వం ఈ నెల 16 నుంచి 28 వరకు అవకాశం ఇవ్వగా.. నేటితో సర్వే ముగుస్తోంది. సర్వేలో పాల్గొనని వారికి ప్రభుత్వ పథకాలు దూరమయ్యే అవకాశం ఉంది.
Similar News
News February 28, 2025
MBNR: ఎల్‌ఆర్ఎస్ దరఖాస్తులకు గడువు పొడిగింపు: కలెక్టర్

LRS కోసం దరఖాస్తు చేసుకున్న వారు మార్చి 31లోగా పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి తెలిపారు. LRS దరఖాస్తులపై చీఫ్ సెక్రటరీతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఆమె మాట్లాడారు. గడువులోగా పరిష్కరించుకున్న వారికి ప్రభుత్వం 25% రాయితీనిస్తుందని, ఈ అవకాశాన్ని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకొని తమ ప్లాట్లను క్రమ బద్ధీకరించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
News February 28, 2025
దేవరకద్రలో రోడ్డు ప్రమాదం

దేవరకద్రలో బ్రిడ్జి వద్ద స్కూటీ, టిప్పర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో స్కూటీపై వెళ్తున్న కౌకుంట్ల మండలం రాజోలి గ్రామానికి చెందిన శ్రీకాంత్, లింగేష్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే వీరిని అంబులెన్స్ లో మహబూబ్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News February 28, 2025
MBNR : రంజాన్‌ను శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీ

మహబూబ్ నగర్ జిల్లాలో రంజాన్ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డి.జానకి గురువారం అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. అందరూ ఒకరిపై ఒకరు విశ్వాసాన్ని పెంపొందించుకుంటూ.. పోలీసులకు సహకరించాలన్నారు. సమాజంలో శాంతిని నెలకొల్పే బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు. సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వదంతులు ప్రజలు నమ్మొద్దన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.