News November 24, 2024
MBNR: చివరి దశకు సర్వే.. కుటుంబాలు ఎన్నంటే!

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కుల గణన సర్వే చివరి దశకు చేరింది. మొత్తం MBNR-2,41,853, NGKL-2,50,596, GDWL-1,67,886, NRPT-1,55,999, WNPT-1,54,793 కుటుంబాలు ఉన్నాయి. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 150 నుంచి 180 ఇళ్లు కేటాయించారు. ఈ నెల 27 వరకు సమగ్ర సర్వే 100% పూర్తి చేస్తామని ఆయా జిల్లాల అధికారులు తెలిపారు.
Similar News
News July 7, 2025
MBNR: HCA 2డే లీగ్.. మొదటి రోజు మనదే

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి B- డివిజన్ 2డే లీగ్ టోర్నీలో ఉమ్మడి పాలమూరు జిల్లా జట్టు మొదటి రోజు సత్తాచాటింది. మొదట బ్యాటింగ్ చేసిన మహబూబ్‌నగర్ జట్టు 68.1 ఓవర్లలో 243/10 పరుగులు చేసింది. అనంతరం రాకేష్-XI జట్టు 19.1 ఓవర్లలో 55/6 పరుగులు చేసింది. మహబూబ్ నగర్ జట్టులో శ్రీకాంత్-71, సంజయ్-69 పరుగులు చేయగా.. గగన్ 4 వికెట్లు తీశారు. మహబూబ్ నగర్ 188 పరుగుల లీడ్‌లో ఉంది.
News July 7, 2025
MBNR: గ్రీవెన్స్ డే.. 12 ఫిర్యాదులు- SP

బాధితులకు తక్షణ న్యాయం అందించడమే లక్ష్యంగా గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్లు మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్ డే నిర్వహించారు. ప్రజల నుంచి మొత్తం 12 ఫిర్యాదులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులను ఫోన్‌లో మాట్లాడి బాధితుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు.
News July 7, 2025
MBNR: ఆ ప్రాంతాల్లో 15 చిరుతల సంచారం.. ప్రజలు అప్రమత్తం

మహబూబ్ నగర్, మహమ్మదాబాద్ మండలాలోని అటవీ ప్రాంతాల్లో సుమారు 15 చిరుతల మేర సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. గాధిర్యాల్ లోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. దీంతో ఫారెస్ట్ అధికారులు లావణ్య, శ్రీనివాస్, సిబ్బంది కొణెంగల గుట్టకు వెళ్లి పరిశీలించారు. కెమెరాలు ఏర్పాటు చేస్తున్నామని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రేంజ్ అధికారి అబ్దుల్ హై పేర్కొన్నారు.