News March 21, 2025
MBNR: చెట్టుపై నుంచి కిందపడి వ్యక్తి మృతి

ఈనెల 15న చెట్టు ఎక్కి ఆకులు తెంచుతుండగా.. కాలు జారికిందపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన బుధవారం అర్ధరాత్రి జరిగింది. స్థానికులు వివరాలు.. అడ్డాకుల మం. పొన్నకల్‌కు చెందిన సత్యం(30) గ్రామ సమీపంలోని చెట్టు ఎక్కి కిందపడ్డారు. ఆయనను కుటుంబసభ్యులు HYDలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మరణించారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
Similar News
News April 1, 2025
NGKL: యువతి ఒంటరిగా రావడం అదునుగా తీసుకున్నారు: ఐజీ

NGKL జిల్లా ఊర్కొండపేట ఆలయానికి వచ్చిన వివాహిత గ్యాంగ్ రేప్ జరిగిన ఘటనా స్థలాన్ని ఈరోజు మల్టీజోన్-2 ఐజీ సత్యనారాయణ పరిశీలించి మాట్లాడారు. అత్యాచారం చేసిన మొత్తం ఏడుగురిని అరెస్ట్ చేశామని, ఆమె ఒంటరిగా రావడాన్ని వారు అదునుగా తీసుకున్నారని తెలిపారు. యువతిని బెదిరించి అత్యాచారం చేశారని, నిందితులకు కఠినంగా శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ జరిపిస్తామన్నారు.
News April 1, 2025
జడ్చర్లలో రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతిచెందిన ఘటన జడ్చర్ల మండలంలో నిన్న జరిగింది. పోలీసుల వివరాలు.. గద్వాల జిల్లా ధరూరు మం. మార్లవీడుకి చెందిన కిశోర్(45) వ్యాపారం చేసుకుంటూ HYDలో నివాసముంటున్నారు. సోమవారం కందూరు రామలింగేశ్వరస్వామి ఆలయానికి తన భార్య పవిత్ర, కుమార్తె శిరీషలతో కలిసి HYD నుంచి జడ్చర్ల మీదుగా వెళ్తున్నారు. మల్లెబోయిన్పల్లి దగ్గర కారు బోల్తా పడటంతో కిశోర్‌కు తీవ్రగాయాలై మృతిచెందారు.
News April 1, 2025
మహబూబ్‌నగర్ జిల్లాలో కిడ్నాప్ కలకలం

MBNR జిల్లాలో నిన్న బాలుడి కిడ్నాప్‌యత్నం కలకలం సృష్టించింది. స్థానికుల వివరాలు.. మిడ్జిల్ మం. వేములకి చెందిన రాజేందర్‌గౌడ్ కుమారుడు రుద్రాన్ష్ నిన్న రాత్రి ఒక్కసారిగా కనిపించకుండాపోయాడు. అదే గ్రామానికి చెందిన రామస్వామి అనే వ్యక్తి బాలుడితో వాడియాల స్టేజీ దగ్గర కనిపించినట్లు గ్రామస్థులు సమాచారమందించారు. అక్కడికెళ్లి రామస్వామిని ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పటంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.