News June 12, 2024

MBNR: చెరువులకు పొంచి ఉన్న ముప్పు

image

ఉమ్మడి జిల్లాలో 6,491 చెరువులు ఉన్నాయి. ఆయకట్టు కలిగిన చెరువులు 672, 100ఎకరాలకు లోబడి ఆయకట్టు కలిగిన చెరువులు, కుంటలు 5,819ఉన్నాయి. భారీ వర్షాలు కురిస్తే చాలా చెరువు కట్టలు తెగిపోయే ప్రమాదముంది. మరమ్మతులు చేపట్టకపోవటమే దీనికి కారణం. గతేడాది వర్షాలకు కట్టలు కుంగి దెబ్బతిన్నాయి. తూముల్లో మట్టి, మొక్కలు మొలిచాయి. చెరువులను ఇటు నీటి పారుదల శాఖ, అటు రెవెన్యూ శాఖ పర్యవేక్షణ ఆరేళ్లుగా పూర్తిగా కొరవడింది.

Similar News

News October 25, 2025

బాలానగర్: పుట్టినరోజే.. చివరి రోజుగా మారింది..!

image

బాలానగర్ మండలంలోని పంచాంగుల గడ్డ తండాలో శనివారం తీవ్ర విషాదం నెలకొంది. తాండవాసుల వివరాల ప్రకారం.. కేతావత్ విష్ణు (25) సెంట్రింగ్ పనులు చేస్తూ జీవనం సాగించేవాడు. కుటుంబ సభ్యులతో భూమి, డబ్బుల విషయంలో విషయంలో గొడవపడ్డాడు. క్షణికావేశంలో 3 రోజుల క్రితం క్రిమిసంహారక మందు తాగాడు. చికిత్స పొందుతూ.. ఈరోజు ఉదయం మృతి చెందాడు. పుట్టినరోజు నాడే.. మరణించడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

News October 25, 2025

రేపు కురుమూర్తిస్వామి అలంకరణ మహోత్సవం

image

పేదల తిరుపతిగా పేరుగాంచిన చిన్నచింతకుంట మండలం అమ్మపూర్‌లోని శ్రీ కురుమూర్తిస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 22నుంచి వైభవంగా ప్రారంభమయ్యాయి.ఈ ఉత్సవాలలో భాగమైన స్వామివారి అలంకరణ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నారు. ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకులో ఉన్న స్వామి వారి ఆభరణాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని స్వామివారికి అలంకరించనున్నట్లు ఆలయ ఛైర్మన్ గోవర్ధన్ రెడ్డి తెలిపారు.

News October 25, 2025

రేపు కురుమూర్తి స్వామి ఆభరణాల ఊరేగింపు

image

శ్రీ కురుమూర్తి స్వామి దేవస్థాన బ్రహ్మోత్సవాల భాగంగా ఆదివారం ఉదయం ఆత్మకూరు SBH బ్యాంకు వద్ద స్వామివారి ఆభరణాల పూజా కార్యక్రమం నిర్వహించనున్నారు. పూజ అనంతరం ఆభరణాలను ఊరేగింపుగా అమ్మాపూర్ సంస్థానాధీశులు రాజా శ్రీ రాంభూపాల్ నివాసానికి తీసుకెళ్లి సంప్రదాయబద్ధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. రాత్రి స్వామికి ఆభరణాల అలంకరణతో మొదటి పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.