News December 21, 2024

MBNR: చెరువులో పడి తల్లి, ఇద్దరు పిల్లల మృతి

image

మహబూబ్‌నగర్ జిల్లా నవాబుపేట మండలంలో పోమాల్‌లో శనివారం విషాదం చోటుచేసుకుంది. పోమాల్ గ్రామానికి ఓ తల్లి, ఇద్దరు పిల్లలు చెరువులో పడి అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News January 21, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔గణతంత్ర దినోత్సవం పకడ్బందీగా ఏర్పాటు చేయండి:కలెక్టర్లు
✔వరి సాగు.. రైతన్నలు బిజీబిజీ
✔NRPT:రోడ్డు ప్రమాదం.. ఓ మహిళ మృతి
✔రేపటి నుంచి అన్ని గ్రామాల్లో గ్రామసభలు
✔ముమ్మరంగా రైతు భరోసా సర్వే
✔అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్లు
✔ప్రజావాణి.. సమస్యలపై ఫోకస్
✔సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:SIలు

News January 20, 2025

అచ్చంపేట: ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణం: మాజీ మంత్రి

image

పౌరహక్కుల నేత ప్రొఫెసర్ హరగోపాల్ అరెస్ట్ దారుణమని ఇది ప్రజాపాలన కాదు ప్రజలను పీడించే పాలన అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. అచ్చంపేట నియోజకవర్గం బల్మూరు మండలం మైలారంలో మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్థుల నిరసనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన ప్రొఫెసర్ హరగోపాల్, ఇతర ప్రజాసంఘాల నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ సర్కారు నియంతృత్వ పాలనకు నిదర్శనమని అన్నారు.

News January 20, 2025

NGKL: అర్హులందరికీ సంక్షేమ పథకాలు: అడిషనల్ కలెక్టర్

image

బిజినేపల్లి మండల కేంద్రంలోనీ తాహశీల్దార్ కార్యాలయాన్ని ఆదివారం జిల్లా అదనపు కలెక్టర్ పి.అమరేందర్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా రైతు భరోసా సర్వే వివరాలను తహశీల్దార్ శ్రీరాములును అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేవిధంగా చూడాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీడీవో కథలప్ప, ఏవో నీతీ, ఎంపీఓ నరసింహులు, మండల ఏఈవోలు పాల్గొన్నారు.