News March 17, 2025
MBNR: చెరువులో మునిగి వ్యక్తి మృతి

జిల్లాకేంద్రంలో ఓ వ్యక్తి చెరువులో మునిగి మృతిచెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. వేపూరిగేరికి చెందిన అశోక్(38) ప్రింటింగ్ ప్రెస్‌లో రోజువారి వర్కర్‌గా పనిచేస్తున్నారు. అయితే హోలీ ఆడిన తర్వాత మద్యం తాగి వెంకటాపూర్ శివారులో ఉన్న చెరువులో స్నానం కోసం వెళ్లాడు. నీటిలోకి దిగిన తర్వాత నీట మునిగిపోవటంతో ఊపిరి ఆడక మృతిచెందాడు. రెండు రోజుల తర్వాత మృతదేహం బయటపడింది. ఈ మేరకు కేసు నమోదైంది.
Similar News
News March 18, 2025
మహబూబ్‌నగర్: ‘పంచాయతీ కార్యదర్శి సంతకం ఫోర్జరీ’

MBNR జిల్లా గండీడ్ మండలం రెడ్డిపల్లికి చెందిన ఓ వ్యక్తి బీమా క్లైమ్ చేసేందుకు పంచాయతీ కార్యదర్శి సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు స్థానికులు తెలిపారు. నకిలీ స్టాంపులతో బతికి ఉండగానే డెత్ సర్టిఫికెట్ సృష్టించి అధికారులను తప్పుదోవ పట్టించాడని చెప్పారు. బ్యాంక్ అధికారులకు అనుమానం వచ్చి విచారణ చేయగా అసలు విషయం బయట పడిందన్నారు. పంచాయతీ కార్యదర్శిని వివరణ కోరగా.. అది ఫేక్ సర్టిఫికేట్ అని చెప్పారు.
News March 18, 2025
MBNR: కట్నం వేధింపులతో ఆత్మహత్య.. తల్లి ఫిర్యాదు

జడ్చర్ల మండలంలో నవవధువు ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లాకి చెందిన చర్చిత(23)కు రాళ్లగడ్డతండాకు చెందిన పవన్‌తో జనవరి31న పెళ్లి జరిగింది. వధువు తల్లిదండ్రులు పెళ్లికి రావాలంటే రూ.10లక్షలు వరకట్నంగా ఇవ్వాలని డిమాండ్ చేయటంతో వారు పెళ్లికి రాలేదు. పెళ్లి తర్వాత అత్త, మామలు వేధింపులకు గురిచేయటంతో చర్చిత ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తల్లి రాధిక ఫిర్యాదు మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.
News March 18, 2025
జడ్చర్ల: చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

ఫినాయిల్ తాగిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందిన ఘటన సోమవారం జరిగింది. పోలీసుల వివరాలు.. జడ్చర్ల మండలం ఉదండాపూర్‌కి చెందిన పెంటయ్య(62) ఆదివారం ఇంట్లో బాత్రూమ్కి వెళ్లి అక్కడ తాగునీళ్లు అనుకుని ఫినాయిల్ తాగాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈమేరకు కేసు నమోదైంది.