News February 10, 2025
MBNR: చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్

ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. సోమవారం స్త్రీ నిధి బ్యాంక్ రుణం ద్వారా అందించిన సంచార చేపల విక్రయ వాహనాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వాహనాన్ని ఎక్కడ వినియోగిస్తారు, వ్యాపారం ఎలా చేస్తారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 19, 2025
బాలానగర్: అంగన్వాడీ టీచర్ అదృశ్యం

ఓ అంగన్వాడీ టీచర్ అదృశ్యమైన ఘటన బాలానగర్ మండలంలోని వనమోనిగూడ గ్రామంలో జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. లత గ్రామంలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తుంది. ఈనెల 16న ఇంట్లో నుంచి ఇద్దరు పిల్లలను తీసుకుని ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయింది. చుట్టుపక్కల, బంధువుల ఇళ్లలో వెతికిన ఆచూకీ లభించలేదని అత్త యాదమ్మ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News March 19, 2025
MBNR: పోక్సో కేసు.. నిందితుడికి జీవిత ఖైదు

ఓ నిందితుడికి పోక్సోకేసులో జైలుశిక్షతో పాటు జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుఇచ్చారు. 2020డిసెంబర్21న కోయిలకొండ PSలో దుప్పుల ఆనంద్ 14ఏళ్ల బాలికను అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సోకేసు నమోదుచేశారు. నేరం రుజువవటంతో నిందితుడికి జీవితఖైదు, రూ.50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి రాజేశ్వరి తీర్పుఇచ్చారు. దీంతో ఎస్పీ జానకి PP, పోలీస్ సిబ్బందిని అభినందించారు.
News March 19, 2025
MBNR: CMకు ‘THANK YOU’ తెలిపిన ఎమ్మెల్యేలు

రాష్ట్రంలోని SC, ST, BC, మైనారిటీ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధిఅవకాశాలను పెంచేందుకు రూ.6000 కోట్ల రాజీవ్ యువ వికాసం పథకాన్ని ప్రారంభించినందున సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఉమ్మడిజిల్లా ఎమ్మెల్యేలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. EWSలకు రూ.1000 కోట్లు కేటాయించాలని వినతిపత్రం అందజేశారు. MLAలు మధుసూదన్ రెడ్డి, పర్నికా రెడ్డి, మేఘారెడ్డి, ఆయా నియోజకవర్గాల MLAలు పాల్గొన్నారు.