News February 10, 2025
MBNR: చేపల విక్రయ వాహనాలను ప్రారంభించిన కలెక్టర్

ప్రభుత్వం పేద మధ్యతరగతి ప్రజలకు సంబంధించిన రుణాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి సూచించారు. సోమవారం స్త్రీ నిధి బ్యాంక్ రుణం ద్వారా అందించిన సంచార చేపల విక్రయ వాహనాలను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. వాహనాన్ని ఎక్కడ వినియోగిస్తారు, వ్యాపారం ఎలా చేస్తారు అని కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
Similar News
News March 17, 2025
బాలానగర్: అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి

అనుమానాదస్పద స్థితిలో ఓ మహిళ మృతి చెందిన ఘటన బాలానగర్ మండలంలో ఆదివారం జరిగింది. ఎస్ఐ లెనిన్ వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన లత (34) ఈనెల 14న ఇంటి నుంచి వెళ్ళిపోయింది. కుటుంబ సభ్యులు వెతికిన ఆచూకీ లభించలేదు. ఆదివారం పెద్దయపల్లి గ్రామ శివారులో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
News March 16, 2025
జడ్చర్ల: మహిళ ఆత్మహత్య.. కేసు నమోదు

మండలంలోని కోల్‌బాయితండాకు చెందిన శారద(45) శుక్రవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసుల వివరాలు.. శారద భర్త ఆరేళ్ల క్రితమే చనిపోయారు. దీంతో కుమారుడు, కోడలి దగ్గర కలిసి ఉంటోంది. ఈ క్రమంలో వీరిద్దరూ తనను వేధిస్తున్నారని తండ్రి తథ్యుతో వాపోయింది. ఈ నేపథ్యంలోనే శారద ఆత్మహత్య చేసుకోగా.. అందుకు కారకులుగా మృతురాలి కుమారుడు, కోడలే అని తండ్రి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదైంది.
News March 16, 2025
MBNR: బావిలో పడి వ్యక్తి మృతి

మిడ్జిల్ మండలంలో ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. స్థానికుల వివరాలు.. వేములకు చెందిన చంద్రయ్య(50) గురువారం రాత్రి గ్రామంలో చేసిన కాముడి దహన కార్యక్రమానికి వెళ్లారు. అనంతరం తిరిగి వస్తుండగా.. గ్రామ సమీపంలోని బావిలో పడిపోయారు. ఎవరూ గమనించకపోవటంతో మునిగిపోయారు. ఈ క్రమంలో శనివారం శవమై తేలాడు. ఈ మేరకు పోలీసులు కేసునమోదు చేశారు.