News March 23, 2025
MBNR: జిల్లాలో ఆ పథకం కింద ఉద్యోగ అవకాశాలు

పీఎం(జే.ఏ.ఎన్.ఏం.ఏ.ఎన్) పథకం కింద కాంట్రాక్టు ప్రాతిపదికన వైద్య ఆరోగ్యశాఖలో ఒక సంవత్సరం కాంట్రాక్టు పద్ధతిలో మెడికల్ ఆఫీసర్ (1), ల్యాబ్ టెక్నీషియన్ (1), పారామెడికల్ కం అసిస్టెంట్ పోస్టులు మొబైల్ మెడికల్ యూనిట్ లో పోస్టుల కోసం కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కృష్ణ ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. ఈనెల 26న జిల్లా కలెక్టరేట్లో ఇంటర్వ్యూలు ఉంటాయన్నారు. SHARE IT.
Similar News
News January 2, 2026
KMR: ఈ నెల 3న జాబ్ మేళా

కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల మూడో తేదీన జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం చెప్పారు. బీపీఓ పోస్టులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన వారు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
News January 2, 2026
ఈడుపుగల్లుకు రైలు కూత.. 49 కి.మీ కొత్త రైల్వే లైన్

తరిగొప్పుల-దుగ్గిరాల మధ్య ప్రతిపాదిత 49k.m కొత్త రైల్వే లైన్‌లో ఈడుపుగల్లు రైల్వేస్టేషన్ కేంద్రంగా మారనుంది. లొకేషన్ సర్వే, మట్టి నమూనాల పరిశీలన పూర్తికావడంతో భూసేకరణ, ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు త్వరలో టెండర్లు పిలవనున్నారు. తరిగొప్పుల నుంచి చీలి, మంతెన దక్షిణంగా రైవాస్ కాలువ మీదుగా ఈడుపుగల్లు,వణుకూరు వైపు ట్రాక్ వెళ్లనుంది. చోడవరం వద్ద రైల్వే కమ్ రోడ్డు బ్రిడ్జి నిర్మాణానికీ కసరత్తు సాగుతోంది.
News January 2, 2026
పిల్లలను పెంచలేక.. ఎవరూ ఆదరించక!

ముగ్గురు పిల్లలకు తండ్రి సురేంద్ర విషం ఇచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన కన్నీళ్లు తెప్పిస్తోంది. భార్య మరణంతో ఆ కుటుంబాన్ని కష్టాలు వెంటాడగా, పిల్లల ఆలనాపాలనా చూసేందుకు ఎవరూ సాయం చేసేవారు కారట. కూలికి వెళ్తేగాని పూట గడవకపోవడం, పిల్లలను చూసుకోవడం భారంగా భావించే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని తెలుస్తోంది. <<18730785>>తుడుమలదిన్నెలో<<>> జరిగిన అంత్యక్రియలకు సురేంద్ర బంధువులు, భార్య తల్లిదండ్రులు రాకపోవడం విచారకరం.


