News April 9, 2024

MBNR: జిల్లాలో ఒక్కసారిగా హీటెక్కిన రాజకీయం

image

ఉమ్మడి MBNR జిల్లాలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా రాజకీయం ఒక్కసారిగా హీట్ ఎక్కింది. జిల్లాలో ఉన్న రెండు పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకునేందుకు ఒకవైపు కాంగ్రెస్ పార్టీ మరోవైపు బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం జిల్లా పై ప్రత్యేక దృష్టి సారించి రెండు ఎంపీ స్థానాలపై గురి పెట్టారు. నిన్న కొడంగల్‌లో పర్యటించడంతో రాజకీయం మరింత వేడెక్కింది.

Similar News

News November 4, 2024

 MBNR: పెట్టుబడులే లక్ష్యంగా ఎమ్మెల్యేల విదేశీ పర్యటన

image

తెలంగాణ ప్రభుత్వ అధికారిక పర్యటనలో భాగంగా ఈనెల 5 నుంచి 7 వరకు లండన్‌లో జరగనున్న వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో తెలంగాణ ప్రభుత్వం తరఫున పాల్గొనేందుకు ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు నేతృత్వంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు కూచుకుల్ల రాజేష్ రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, అనిరుద్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టూరిజం శాఖ అధికారులు లండన్ పర్యటనకు బయలుదేరారు.

News November 4, 2024

MBNR: GET READY.. ఆదిలాబాద్‌తో మొదటి మ్యాచ్

image

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(HCA) ఆండర్-23 వన్డే అంతర్ జిల్లా లీగ్ కం నాకౌట్ క్రికెట్ టోర్నమెంట్ వరంగల్, మెదక్‌లో సోమవారం నుంచి ప్రారంభం కానుంది. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జట్టు మొదటి మ్యాచ్ నేడు ఆదిలాబాద్ జట్టుతో, రేపు వరంగల్ జట్టుతో, 6న ఖమ్మం జట్టుతో తలబడనుంది. మెదక్‌లో 8న సెమీఫైనల్,9న ఫైనల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. టోర్నీలో ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి జట్టుకు ఎంపిక కానున్నారు.

News November 4, 2024

ఉండవెల్లి: తాజా మాజీ సర్పంచుల ముందస్తు అరెస్టు

image

పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తాజా మాజీ సర్పంచులందరు సెక్రటేరియట్ ముట్టడికి పిలుపు ఇవ్వడంతో తాజా మాజీ సర్పంచులను ముందస్తుగా అరెస్టు చేశారు. వీరిలో ఉండవెల్లి సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు సురవరం లోకేశ్వర రెడ్డి, మాజీ సర్పంచులు శేషన్ గౌడ్, శివరాముడు, పవిత్ర జనార్దన్ రెడ్డి, భాస్కర్, ఈదన్న, పోలీసులు ముందస్తు అరెస్టు చేసి ఉండవెల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.