News April 28, 2024

MBNR:  జిల్లాలో నిన్నటి ఉష్ణోగ్రతలు

image

వడ్డెమాన్ 44.2℃, జానంపేట 43.4, బాలానగర్ 43.2, కొత్తపల్లె 43.0, సల్కర్‌పేట 42.9, మహబూబ్ నగర్ 42.9, సెరివెంకటాపూర్ 42.8, మహబూబ్ నగర్ 42.5, అడ్డాకల్ 42.5, భూత్పూర్ 42.4, చిన్న చింత కుంట 42.4, దేవరకద్ర 42.2, హన్వాడ 42.2, మహమ్మదాబాద్ 42.2, కౌకుంట్ల 42.0, జడ్చర్ల 41.8, కొత్త మోల్గార 41.8, పార్పల్లి 41.4, మాచన్‌పల్లె 41.4, రాజాపూర్ 41.4, దోనూరు 40.9, నవాబుపేట 40.3, మిడ్జిల్లో 40.5℃గా నమోదైంది.

Similar News

News October 29, 2025

అంగరంగ వైభవంగా ఉద్దాల మహోత్సవం

image

కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రధానఘట్టమైన ఉద్దాలమహోత్సవం మంగళవారంరాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు హాజరై స్వామివారి పాదుకలను దర్శించుకున్నారు. స్వామివారి పాదుకలను తాకి పునితులయ్యేందుకు భక్తులు పోటీపడ్డారు. దీంతో చిన్నవడ్డేమాన్‌, ఊకచెట్టువాగు, అప్పంపల్లి, తిర్మలాపూర్‌ గ్రామాలతోపాటు స్వామి ఆలయం వరకు జనసంద్రంమైంది. ఉత్సవంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

News October 29, 2025

MBNR: కురుమూర్తి జాతర.. సమీక్షించిన ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లా చిన్న తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి జాతర సందర్భంగా ఈ రోజు ఉద్దాల బందోబస్త్ ఏర్పాట్లను జిల్లా ఎస్పీ డి.జానకి స్వయంగా పరిశీలించారు. చిన్న వడ్డెమాన్ గ్రామం నుంచి ఉద్దాల కార్యక్రమం ప్రారంభమైన ప్రాంతం నుంచి ఉద్దాల గుడి వరకు ఎస్పీ స్వయంగా పర్యటించి, భక్తుల రాకపోకలు, ట్రాఫిక్ సదుపాయాలు, పార్కింగ్ సౌకర్యం, భద్రతా, మహిళల కోసం ప్రత్యేక ఏర్పాట్లను సమీక్షించారు.

News October 28, 2025

MBNR: టీఆర్పి పార్టీ మేధావుల నిపుణుల కమిటీ ఛైర్మన్ నియామకం

image

MBNR జిల్లా కేంద్రానికి చెందిన రిటైర్డ్ డీఈవో, డాక్టర్ శివార్చక విజయ్ కుమార్‌ను తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు తీన్మార్ మల్లన్న వీరిని రాష్ట్ర మేధావులు, నిపుణుల సమన్వయ కమిటీ ఛైర్మన్‌గా నియమించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్టీ బలోపేతం, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను అంకితభావం నిబద్దతతో కలుపుకొని క్షేత్రస్థాయిలో కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయాలన్నారు.