News December 23, 2024
MBNR: జిల్లాలో పెరిగిన చలి పులి
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా మొన్నటితో పోలిస్తే చలి తీవ్రత పెరిగింది. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయాన్నే స్నానాలు చేసి బడికి వెళ్లే విద్యార్థులు గజగజ వణుకుతున్నారు. గత 24 గంటలలో గద్వాల జిల్లా ఇటిక్యాల మం. సాతర్ల గ్రామంలో 18.0, మహబూబ్‌నగర్ జిల్లా రాజాపూర్ మం. కేంద్రంలో 15.7, నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మం. తోటపల్లి 16.7, వనపర్తి జిల్లా రేవల్లి మండల కేంద్రంలో 18.1డిగ్రీల కనిష్ఠ నమోదయ్యాయి.
Similar News
News January 24, 2025
MBNR: రాష్ట్రంలోనే నంబర్ 1 కాలేజీగా అభివృద్ధి చేస్తా: ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ లోని జేపీ ఐటీఐ కళాశాల భవననిర్మాణానికి రూ.కోటి మంజూరు అయ్యాయని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. కళాశాలను ఎమ్మెల్యే సందర్శంచి, కళాశాలలోని పరిసరాలను పరిశీలించారు. అవసరమైన మౌలిక సదుపాయాల గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కళాశాలకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలోనే నంబర్ వన్ కాలేజీగా అభివృద్ధి చేస్తానన్నారు.
News January 24, 2025
పాలమూరు నుంచి డిండికి నీటి మళ్లింపు
పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి డిండికి నీటి మళ్లింపు నిర్ణయం ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. రేవంత్ రెడ్డి మంత్రివర్గం ఆమోదం తెలపడం, తాజాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వడం పట్ల జిల్లాలో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంత జరుగుతున్నా జిల్లా MLAలు, ప్రజాప్రతినిధుల మౌనం జిల్లా వాసులను కలవర పెడుతోంది. దీనిపై ఆందోళనలు ఉద్ధృతం చేసేందుకు పాలమూరు అధ్యయన వేదిక ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
News January 24, 2025
MBNR: ప్రభుత్వ ఉద్యోగుల డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రద్దు !
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పొందిన ఉద్యోగులపై కలెక్టర్ విజయేందిర కొరడా ఝుళిపించారు. వారికి కేటాయించిన ఇళ్లను స్వాధీనం చేసుకోవాలని ఆదేశించారు. అనర్హులకు డబుల్ ఇళ్ల కేటాయించారన్న ఫిర్యాదులపై విచారణకు ఆదేశించారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ, రిటైర్డ్, పెన్షనర్లు ఇళ్లు పొందినట్లు తేలింది. దీంతో నిబంధనలు అతిక్రమించిన ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాని చెప్పారు.