News January 31, 2025

MBNR జిల్లాలో శిశు మరణాలు తగ్గించాలి: జిల్లా కలెక్టర్

image

మహబూబ్ నగర్ జిల్లాలో శిశు మరణాలు తగ్గించేందుకు అధికారులు కృషి చేయాలని మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. శిశు మరణాలు తగ్గించేందుకు స్త్రీ గర్భవతిగా ఉన్నప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ యొక్క గత కాన్పుల వివరాలు తెలుసుకుని పరీక్షలు నిర్వహించాలని అన్నారు.

Similar News

News January 31, 2025

జడ్చర్ల: చెట్టుపై నుంచి కిందపడి యువకుడి మృతి 

image

జడ్చర్ల మండలం మూల స్తంభం తండాకు చెందిన రాథోడ్ తరుణ్ నాయక్ (29) పొట్టకూటి కోసం కుటుంబంతో కలిసి తాండూర్‌కు వలస వెళ్లాడు. అడ్డా కూలిగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గురువారం పోస్ట్ ఆఫీస్‌లోని చెట్లను తొలగిస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి పడి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వపరంగా ఆర్థిక సహాయం అందించాలని గ్రామస్థులు విజ్ఞప్తి చేశారు.

News January 31, 2025

ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS!!

image

✔MBNR:పీయూ డిగ్రీ ఫలితాలు విడుదల
✔420 హామీలతో అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్:BRS
✔NRPT:ఆకతాయిలు వేధిస్తే చట్టపరమైన చర్యలు:పోలీసులు
✔ఘనంగా మహాత్మా గాంధీ వర్ధంతి వేడుకలు
✔7 నుంచి మన్యంకొండ బ్రహ్మోత్సవాలు
✔బిజినపల్లి: కుష్ఠి వ్యాధి నిర్మూలనపై ప్రతిజ్ఞ
✔సీఎంఆర్ఎఫ్ పేదల ఆరోగ్యానికి ఆర్థిక భరోసా:ఎమ్మెల్యేలు
✔గద్వాల: విద్యార్థిని చితకబాదిన టీచర్ పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

News January 30, 2025

MBNR: లేగ దూడపై చిరుత దాడి

image

కొత్తపల్లి మండలం నిడ్జింత గ్రామ శివారులో లేగ దూడపై చిరుత దాడి చేసి చంపింది. ఇదే గ్రామానికి చెందిన కాశప్ప లేగ దూడతో పాటు పశువులను బుధవారం సాయంత్రం పొలం వద్ద కట్టేసి వెళ్ళిపోయాడు. గురువారం ఉదయం వచ్చి చూడగా లేగ దూడ మృతి చెంది ఉంది. చిరుత పులి దాడి చేసి ఉంటుందని రైతులు అనుమానిస్తున్నారు. అటవీ శాఖ అధికారులు చిరుత పులి జాడ కనిపెట్టి బంధించాలని చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు, రైతులు కోరుతున్నారు.