News February 6, 2025

MBNR: జూరాలకు నీటిని విడుదల చేయండి.!

image

క‌ర్నాట‌క‌లోని నారాయ‌ణ‌పూర్ డ్యాం నుంచి 5 టీఎంసీల‌ నీటిని విడుద‌ల చేసి ఉమ్మ‌డి పాల‌మూరు జిల్లా సాగు, తాగునీటి అవ‌స‌రాలు తీర్చాల‌ని ఆ రాష్ట్ర సీఎం సిద్దారామ‌య్య‌ను మంత్రులు జూప‌ల్లి కృష్ణారావు, శ్రీధ‌ర్ బాబు కోరారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేర‌కు ఎమ్మెల్యేలు కృష్ణమోహన్‌ రెడ్డి, శ్రీహ‌రి, మధుసూదన్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌లు మంగ‌ళ‌వారం బెంగ‌ళూర్‌లో సీఎంను క‌లిసి వినతి పత్రం అందించారు.

Similar News

News February 6, 2025

నాటోకు జెలెన్‌స్కీ అల్టిమేటం

image

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నాటో, పశ్చిమ దేశాలకు తాజాగా అల్టిమేటం జారీ చేశారు. తమకు అణ్వాయుధాలో లేక నాటోలో సభ్యత్వమో ఏదొకటి త్వరగా తేల్చాలని ఓ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ‘ఓవైపు రష్యా మాపై దూకుడు పెంచుతుంటే మాకెందుకు నాటో సభ్యత్వం ఇవ్వడం లేదు? ఇప్పట్లో నాటో సభ్యత్వం ఇచ్చే ఆలోచన లేకపోతే వెంటనే అణ్వాయుధ క్షిపణుల్నైనా మాకు ఇవ్వాలి. మమ్మల్ని మేం రక్షించుకునేదెలా?’ అని ప్రశ్నించారు.

News February 6, 2025

పెద్దపల్లి: విషాదం.. కంటికి మోటార్ బోల్ట్ తగిలి వ్యక్తి మృతి

image

అంతర్గాం మండలం గోలివాడలోని కాళేశ్వర్వం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌లో భాగమైన పార్వతి పంప్-హౌస్ వద్ద బుధవారం దుర్ఘటన చోటుచేసుకుంది. జమ్మికుంటకు చెందిన మెగా కంపెనీ కార్మికుడు గుండబోయిన సంపత్(25) తన విధులు నిర్వహిస్తుండగా, మోటార్ పంపు బోల్ట్ ఎగిరి కంటికి తగిలింది. దీంతో తీవ్రగాయాలపాలైన అతడిని గోదావరిఖని ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలో మరణించాడు. మృతుడి స్వస్థలం వరంగల్‌లోని దామెర గ్రామం.

News February 6, 2025

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లపై నిషేధం.. ట్రంప్ సంతకం

image

మహిళల క్రీడల్లో ట్రాన్స్‌జెండర్లు పాల్గొనడాన్ని నిషేధించే ఆదేశాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. మహిళల క్రీడలపై జరుగుతున్న యుద్ధం ఈ ఆదేశాలతో ముగుస్తుందని ఆయన పేర్కొన్నారు. ‘మహిళా అథ్లెట్ల సంప్రదాయాన్ని మేం రక్షిస్తాం. వారి క్రీడల్లోకి పురుషులు ప్రవేశించి, వారిని కొట్టడాన్ని అడ్డుకుంటాం. ఇక నుంచీ స్త్రీల క్రీడలు స్త్రీలకు మాత్రమే’ అని స్పష్టం చేశారు.

error: Content is protected !!