News October 1, 2024
MBNR: జూ.అధ్యాపకుల ఎదురుచూపులు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికైన వారికి ఈనెల 9న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేయనున్నారు. ప్రభుత్వం కేవలం 55 రోజుల్లో డీఎస్సీ ఫలితాలను వెల్లడించి 10 రోజుల్లో నియామక పత్రాలు అభ్యర్థులకు అందించనుంది. కానీ ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో జూనియర్ అధ్యాపకుల భర్తీని పట్టించుకోవడంలేదని ఎంపికైన అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నియామక పత్రాల కోసం ఎంపికైన వారు ఎదురుచూస్తున్నారు.
Similar News
News October 15, 2024
కంచెలకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వొద్దు: ఎస్పీ
వనపర్తి జిల్లాలోని రైతులు తమ వ్యవసాయ పొలాల్లోని పంటలను రక్షించుకునేందుకు ఏర్పాటు చేసుకున్న కంచెలను విద్యుత్ కనెక్షన్లు ఇవ్వరాదని జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ రైతులకు సూచించారు. జిల్లాలో పోలీసుల హెచ్చరికను పట్టించుకోకుండా రైతులు తమ ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రమాద హెచ్చరికలను గుర్తించకుండా కేవలం పంటచేలను రక్షించుకునేందుకు విద్యుత్ కంచెలు ఏర్పాటు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
News October 15, 2024
ఉమ్మడి జిల్లాలో నేటి ముఖ్యంశాలు!!
✒GDWL:ప్రజావాణిలో పురుగు మందు తాగిన రైతు
✒బిజినేపల్లి: కాలువలో గల్లంతైన వ్యక్తి మృతి
✒21 నుంచి SA-1 పరీక్షలు: DEOలు
✒దసరా EFFECT.. మద్యం అమ్మకాల్లో 80.14 కోట్ల ఆదాయం
✒ప్రజావాణి.. సమస్యలపై దృష్టి పెట్టండి: కలెక్టర్లు
✒జూరాలకు జలాశయానికి పెరిగిన వరద
✒ప్రయాణికులతో కిక్కిరిసి పోయిన ఆర్టీసీ బస్టాండ్లు
✒రేపటి నుంచి పాఠశాలలు ప్రారంభం
News October 14, 2024
MBNR: దసరాకు ఫుల్లుగా దావత్.!
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా దసరా పండుగ సందర్భంగా మద్యం అమ్మకాల్లో ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం పెరిగింది. ఉమ్మడి జిల్లాల్లో 230 మద్యం దుకాణాలు ఉండగా..రూ.80.14 కోట్ల విక్రయాలు జరిగాయి. గ్రామాల్లో మద్యం అందుబాటులో ఉంచుతుండటంతో రాత్రి, పగలు తేడా లేకుండా మద్యం లభిస్తుంది. పండగకు సొంతూరు వచ్చిన బంధువులు, మిత్రులతో కలిసి జోరుగా దావత్లు చేసుకున్నారు. బీరు, విస్కీ అమ్మకాలు అధికంగా జరిగాయి.