News March 21, 2025
MBNR: టెన్త్ పరీక్షలు.. జిల్లాల వారీగా వివరాలు ఇలా!

టెన్త్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ✔MBNR:60 పరీక్ష కేంద్రాలు-13,038 మంది విద్యార్థులు ✔NRPT:39 పరీక్ష కేంద్రాలు-7,631 మంది విద్యార్థులు ✔NGKL: 60 పరీక్ష కేంద్రాలు-10,598 మంది విద్యార్థులు ✔GDWL: 40 పరీక్ష కేంద్రాలు-7,717 మంది విద్యార్థులు ✔WNPT:36 పరీక్ష కేంద్రాలు-6,853 మంది విద్యార్థులు >ALL THE BEST!!
Similar News
News October 23, 2025
NLG: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలి: కలెక్టర్

అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సంబంధిత అధికారులను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం సరైన తేమ, నాణ్యత ప్రమాణాలు కలిగి ఉన్నట్లయితే తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని చెప్పారు. బుధవారం ఆమె దాన్యం సేకరణపై పౌర సరఫరాలు, సంబంధిత శాఖల అధికారులతో తన ఛాంబర్లో కలెక్టర్ సమీక్షించారు.
News October 23, 2025
ఓటీటీలోకి వచ్చేసిన ‘OG’

పవన్ కళ్యాణ్, ప్రియాంక మోహన్ జంటగా డైరెక్టర్ సుజిత్ తెరకెక్కించిన ‘OG’ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.308 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిందని మూవీ యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించారు. ప్రకాశ్ రాజ్, ఇమ్రాన్ హష్మి, శ్రియా రెడ్డి, అర్జున్ దాస్ కీలక పాత్రలు పోషించారు.
News October 23, 2025
కామారెడ్డి: మద్యం దుకాణాల కోసం నేడు తుది గడువు.!

కామారెడ్డి జిల్లాలోని 49 మద్యం దుకాణాల కోసం బుధవారం (నిన్న) వరకు 1,449 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ హనుమంత రావు Way2Newsకు తెలిపారు. నేటికి చివరి రోజు కావడంతో దరఖాస్తుల సంఖ్య ఈరోజు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలోని అత్యధికంగా కామారెడ్డి స్టేషన్ పరిధిలోని 15 షాపులకు 450 దరఖాస్తులు వచ్చాయన్నారు.