News October 9, 2024
MBNR: డీఎస్సీకి 1,131 మంది ఎంపిక
ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తం 1,131 మందితో DSC తుది జాబితాను విద్యాధికారులు ప్రకటించారు. ఎంపికైన అభ్యర్థులు నేడు LB స్టేడియంలో CM రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నియామక పత్రాలు అందుకోనున్నారు. MBNR-243, గద్వాల-172, NGKL- 285, వనపర్తి-152, NRPT-279 మంది ఎంపికయ్యారు. వారిని సీఎం సభకు తరలించేందుకు జిల్లాల వారీగా ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. దసరా సెలవుల్లోగా పాఠశాలలను కేటాయించనున్నట్లు సమాచారం.
Similar News
News November 13, 2024
మహిళలకు రక్షణ భరోసా కేంద్రాలు: డీకే అరుణ
భరోసా కేంద్రాల ద్వారా మహిళలకు మరింత రక్షణ లభిస్తుందని ఎంపీ డీకే అరుణ అన్నారు. షీటీం ఆధ్వర్యంలో మంగళవారం MBNRలోని మోనప్పగుట్టలో భరోసా కేంద్రం ప్రారంభోత్సవంలో MP పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ.. మహిళల, బాలల రక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన భరోసా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ చిన్నారెడ్డి, MLA శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ విజయేంద్ర, SP జానకి పాల్గొన్నారు.
News November 13, 2024
MBNR: గ్రూప్-3 పరీక్ష సజావుగా నిర్వహించాలి: కలెక్టర్
ఈ నెల 17,18 తేదీలలో నిర్వహించే గ్రూప్-3 పరీక్ష జిల్లాలో సజావుగా నిర్వహించాలని MBNR అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో పరీక్ష నిర్వహణకు సంబంధించి చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫీసర్, రూట్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్వ్కాడ్, పోలీస్ అధికారులతో శిక్షణ తరగతులను నిర్వహించారు. MBNR, దేవరకద్రలలో 52 పరీక్షా కేంద్రాల్లో 19,465 మంది అభ్యర్థులు పరీక్ష రాస్తున్నట్లు తెలిపారు.
News November 12, 2024
వెల్దండ: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య
వెల్దండ మండలం మహాత్మాగాంధీ తండా సమీపంలో వారం రోజుల క్రితం జరిగిన మర్డర్ కేసును పోలీసులు చేధించారు. రాజు అనే వ్యక్తిని అతని భార్య హిమబిందు, ఆమె ప్రియుడు, మరోవ్యక్తి కలిసి హత్య చేసినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. మంగళవారం సాయంత్రం నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ముగ్గురు నిందితులను రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వివరించారు.