News March 23, 2024
MBNR: డీకే అరుణ పూటకో పార్టీ మార్చారు: వంశీచంద్ రెడ్డి
మహబూబ్‌నగర్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు పూటకు ఓ పార్టీ మార్చిన చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి విమర్శించారు. శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. డీకే అరుణ నన్ను ఎమ్మెల్యే చేసినట్లు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని, నాకు టికెట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. గద్వాలలో అరుణ కుటుంబపాలన కోసం ఇప్పటికీ ప్రయత్నిస్తుందని అన్నారు.
Similar News
News November 12, 2024
MBNR: ఈనెల 15న ఉమ్మడి జిల్లా బాక్సింగ్ ఎంపికలు
MBNR జిల్లా కేంద్రంలోని ఇండోర్ స్టేడియంలో ఈనెల 15న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఉమ్మడి జిల్లా స్థాయి అండర్ 8-14, అండర్-17 విభాగాల బాలబాలికల బాక్సింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎసీఎఫ్ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి శారదాబాయి తెలిపారు. ఎంపికల్లో పాల్గొనే వారు పాఠశాల బోనఫైడ్, ఆధార్ కార్డు జిరాక్స్‌తో ఉ.10 గంటలకు హాజరు కావాలని కోరారు.
News November 11, 2024
కల్వకుర్తి: తాండ్రలో నేడు సదర్ సమ్మేళనం
కల్వకుర్తి మండలంలోని తాండ్ర గ్రామంలో ఇవాళ సాయంత్రం 7 గంటలకు యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవస్థానం వద్ద సదర్ సమ్మేళనం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని శ్రీకృష్ణ యాదవ సంఘం నాయకులు తెలిపారు.
News November 11, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లాలో అనాధగా మారిన ఇంటర్ విద్య
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇంటర్ విద్యలో జిల్లా ఇంటర్ అధికారి (DIEO) పోస్టులు మంజూరు చేయాలని ఇంటర్ ఉద్యోగ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఐదు జిల్లాల్లో ఎక్కడా జిల్లా ఇంటర్ అధికారి పోస్టులు మంజూరు కాకపోవడంతో ఇన్‌ఛార్జ్‌లతో నెట్టుకు వస్తున్నారు. దీంతో పర్యవేక్షణ కొరవడి ఇంటర్ విద్య గాడి తప్పుతోందని విమర్శలు ఉన్నాయి.