News February 1, 2025

MBNR: తమ్ముడిని దించొద్దామని వెళ్లి.. చనిపోయాడు

image

MBNR జిల్లా మన్యంకొండ సమీపంలో నిన్న జరిగిన <<15324831>>రోడ్డు ప్రమాదం<<>>లో ఓ యువకుడు మృతిచెందిన విషయం తెలిసిందే. కాగా.. మండలంలోని పోతన్‌పల్లికి చెందిన ఆంజనేయులు(21) తమ్ముడు కేశవులు(19) గుంటూర్‌లో చదువుకుంటున్నాడు. సెలవులపై వచ్చిన కేశవులును గుంటూర్‌కు పంపేందుకు శుక్రవారం తెల్లవారుజామున బైక్‌పై ఇద్దరూ బయలుదేరారు. ఈ క్రమంలోనే ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఆంజనేయులు మృతి చెందాడు. కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు.

Similar News

News December 7, 2025

అనకాపల్లి: ఊర్లో ఖాళీగా తిరుగుతున్నాడని తిట్టడంతో ఆత్మహత్య

image

మాడుగుల (M) జమిదేవి పేటకు చెందిన బాలు(19)ని కుటుంబ సభ్యులు మందలించడంతో సూసైడ్ చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. బాలు గతేడాది ఇంటర్ పూర్తిచేసి ప్రస్తుతం ఊర్లో ఖాళీగా తిరుగుతున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు మందలించడంతో మనస్థాపంతో గ్రామంలోని అతని అమ్మమ్మ ఇంటి మేడ పైన ఉరేసుకొని చనిపోయాడు. మృతుడి తల్లి లక్ష్మి ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు మాడుగుల ఎస్సై నారాయణరావు శనివారం తెలిపారు.

News December 7, 2025

రైతు బజార్ల నుంచి పండ్లు, కూరగాయల హోం డెలివరీ

image

AP: బ్లింకిట్, స్విగ్గీ, బిగ్ బాస్కెట్ తరహాలో రాష్ట్ర ప్రభుత్వం క్విక్ కామర్స్ రంగంలోకి అడుగుపెట్టింది. రైతుబజార్లను ఆన్‌లైన్ పరిధిలోకి తెచ్చింది. కూరగాయలు, పండ్లను <>digirythubazaarap.com<<>> సైట్ ద్వారా బుక్ చేసుకుంటే డెలివరీ ఛార్జీలు లేకుండానే నిమిషాల వ్యవధిలోనే హోమ్ డెలివరీ చేస్తుంది. విశాఖలో పైలట్ ప్రాజెక్టు కింద దీన్ని ప్రారంభించింది. ఇది సక్సెస్ అయితే మిగతా రైతుబజార్లకూ విస్తరించనుంది.

News December 7, 2025

శని దోషాలు ఎన్ని రకాలు?

image

జ్యోతిషం ప్రకారం.. శని గ్రహ సంచారాన్ని బట్టి ప్రధానంగా 3 దోషాలుంటాయి. మొదటిది ఏలినాటి శని. జన్మరాశికి 12, 1, 2 స్థానాల్లో శని గ్రహం ఉండటం వల్ల ఏర్పడుతుంది. ఇది ఒక్కో స్థానానికి 2.5 ఏళ్ల చొప్పున మొత్తం ఏడున్నర ఏళ్ల పాటు ఉంటుంది. రెండోది అష్టమ శని. 8వ స్థానంలో 2.5 ఏళ్లు నష్టాలు, ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. మూడోది అర్ధాష్టమ శని. 4వ స్థానంలో 2.5 ఏళ్లు కుటుంబ, స్థిరాస్తి వివాదాలను సూచిస్తుంది.