News January 30, 2025
MBNR: తల్లి నిద్రలేచేసరికి.. దూలానికి వేలాడుతూ కొడుకు

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్రలేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసునమోదు చేశారు.
Similar News
News February 26, 2026
NCC విద్యార్థులకు రిజర్వేషన్లు: మండిపల్లి

రాష్ట్రంలో NCC కేడెట్లకు కాలేజీ ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పించినట్లు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వెల్లడించారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో గురువారం ఆయన మాట్లాడారు. పోలీస్, ఎక్సైజ్, ఫారెస్ట్ శాఖల్లో NCCకి ప్రత్యేక కోటా లేదని స్పష్టం చేశారు. క్రీడాకారుల ఉద్యోగ రిజర్వేషన్‌ను 2% నుంచి 3%కు పెంచామన్నారు. DSCలో 421 క్రీడాకారులకు రాత పరీక్ష లేకుండా ఉద్యోగావకాశాలు కల్పించినట్లు తెలిపారు.
News February 26, 2026
కడప: ఓ ప్రభుత్వ అధికారి ఫిర్యాదు చేసినా పట్టించుకోరా?

జౌళి శాఖ అధికారులు <<19165873>>తన సంతకాన్ని, పేరును<<>> వాడుకొని అక్రమాలు చేశారని ఇరిగేషన్ అధికారి AEE గౌతమ్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. AEE ఫిర్యాదు చేసి 3 నెలలు గడుస్తున్నా తప్పు చేసిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వస్తున్నాయి. PGRSలో ఓ ప్రభుత్వ అధికారి చేసిన ఫిర్యాదుకే చర్యలు లేనపుడు, సామాన్య ప్రజల ఫిర్యాదులు ఎలా పరిష్కారం అవుతాయనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి.
News February 26, 2026
బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్‌లో జీవీఎంసీ విజయం

బ్లూమ్‌బెర్గ్ మేయర్స్ ఛాలెంజ్ 2025-26లో ప్రపంచవ్యాప్తంగా పోటీపడిన 630 నగరాలలో విశాఖపట్నం (GVMC) టాప్ 24 విజేతలలో ఒకటిగా నిలిచింది. ఈ ఘనత సాధించినందుకు నగరానికి $1 మిలియన్ నిధులు లభించాయని కమిషనర్ కేతన్ గార్గ్ తెలిపారు. ఈ నిధితో ‘ప్రజాముఖి అర్బన్ లివింగ్ ల్యాబ్’ ద్వారా వరదలు, తుపాన్లు, తీవ్రమైన ఎండల నుంచి నగరాన్ని రక్షించేందుకు వినూత్న కార్యక్రమాలు చేపడతామని ఆయన వివరించారు.


