News January 30, 2025

MBNR: తల్లి నిద్రలేచేసరికి.. దూలానికి వేలాడుతూ కొడుకు

image

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్ర లేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసునమోదు చేశారు.

Similar News

News February 13, 2025

క్రమబద్ధీకరణ పథకం కింద తొలి దరఖాస్తును పరిశీలించిన కలెక్టర్

image

ప్రభుత్వ నిబంధనల మేరకు క్రమబద్ధీకరణ పథకం కింద ఇంటి పట్టా మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ పేర్కొన్నారు. గురువారం అనంతపురం రూరల్ పరిధిలోని కక్కలపల్లి గ్రామంలో క్రమబద్ధీకరణ పథకం-2025 కింద దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారుల ఇంటికి నేరుగా వెళ్లి కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఇంటి పట్టా మంజూరు చేయాలని అధికారులకు ఆదేశించారు.

News February 13, 2025

పెద్దేముల్: సెలవు ఇవ్వాలని డిమాండ్

image

ఫిబ్రవరి 15న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేనావత్ రవికుమార్, మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దేశంలో 15 కోట్ల మంది, రాష్ట్రంలో 40 లక్షలమంది లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, గోవింద్ నాయక్, సవిత తదితరులు పాల్గొన్నారు.

News February 13, 2025

రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు?

image

రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా PM నేతృత్వంలోని మంత్రి వర్గం సిఫార్సులతో ఆర్టికల్ 356(1) ప్రకారం <<15452930>>రాష్ట్రపతి పాలన<<>> విధిస్తారు. ఆ తర్వాత పాలనా వ్యవహారాలను రాష్ట్రపతి సూచనతో గవర్నర్ పర్యవేక్షిస్తారు. ఆర్టికల్ 356(4) ప్రకారం 6నెలలు ఈ పాలన కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదంతో గరిష్ఠంగా 3ఏళ్లు విధించొచ్చు.

error: Content is protected !!