News January 30, 2025
MBNR: తల్లి నిద్రలేచేసరికి.. దూలానికి వేలాడుతూ కొడుకు

MBNR జిల్లా అడ్డాకుల మండలం నాగాయపల్లికి చెందిన గద్దెగూడెం చెన్నయ్య(24) బుధవారం <<15299048>>ఆత్మహత్య<<>> చేసుకున్న విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ భోజనం చేసిన తర్వాత అర్ధరాత్రి చెన్నయ్య ఉరేసుకున్నాడు. తల్లి తెల్లవారుజామున నిద్ర లేచి చూసేసరికి కొడుకు దూలానికి వేలాడుతూ కనిపించాడు. దీంతో ఒక్కసారిగా ఆమె షాక్‌కు గురై కేకలు వేస్తూ బోరున విలపించింది. పోలీసులు కేసునమోదు చేశారు.
Similar News
News February 18, 2025
తాండూరు: కాంట్రాక్ట్ ఉద్యోగి ఆత్మహత్యాయత్నం

తాండూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సింలు అనే వ్యక్తి 20 ఏళ్ల నుంచి సెక్యూరిటీ గార్డ్‌గా విధులు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలలుగా జీతాలు రాక మనస్తాపానికి గురై నర్సింలు పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు కుటుంబీకులు తెలిపారు. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గతంలో ఏజెన్సీల ద్వారా జీతాలు వచ్చేవని కానీ ఇప్పుడు ఆ ఏజెన్సీ నుంచి సక్రమంగా జీతాలు అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
News February 18, 2025
BREAKING: టికెట్లు విడుదల

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను టీటీడీ విడుదల చేసింది. మే నెలకు సంబంధించి సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళపాదపద్మారాధన టికెట్లను విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు వీటిని నమోదు చేసుకోవచ్చు. టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 20వ తేదీ నుంచి 22 వరకు డబ్బులు చెల్లించాలి. టికెట్లు బుక్ చేసుకునేందుకు ఇక్కడ <
News February 18, 2025
Stock Markets: ఐటీ తప్ప అన్నీ…

దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాటుగా ట్రేడవుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందాయి. నిఫ్టీ 22,917 (-40), సెన్సెక్స్ 75,920 (-70) వద్ద చలిస్తున్నాయి. ఐటీ మినహా అన్ని రంగాల సూచీలూ నష్టాల్లోనే ఉన్నాయి. బెంచ్‌మార్క్ సూచీలు ఇప్పటికే ఓవర్‌సోల్డ్ జోన్లోకి వెళ్లడంతో కౌంటర్ ర్యాలీకి అవకాశం ఉంది. టెక్ మహీంద్రా, విప్రో, ఇన్ఫీ, అపోలో హాస్పిటల్స్, హెచ్‌సీఎల్ టెక్ టాప్ గెయినర్స్.