News January 30, 2025

MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

image

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్‌లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Similar News

News November 3, 2025

మీర్జాగూడ ప్రమాదం.. కండక్టర్ సేఫ్

image

మీర్జాగూడ బస్సు ప్రమాద ఘటనలో ప్రయాణికులతో పాటు డ్రైవర్ దస్తగిరి బాబు చనిపోయాడు. కండక్టర్ రాధ గాయాలతో బయటపడినట్లు తెలిసింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆమెను మంత్రి పొన్నం ప్రభాకర్, తాండూరు MLA బుయ్యని మనోహర్, MLC పట్నం మహేందర్ పరామర్శించారు. మిగతా క్షతగాత్రులు చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News November 3, 2025

NTR: జోగి రమేశ్ భార్య, కుమారులపై కేసు నమోదు

image

మాజీ మంత్రి జోగి రమేశ్ భార్య, కుమారుడిపై విజయవాడ మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయింది. జోగి రమేశ్ అరెస్ట్ సమయంలో వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు జీజీహెచ్‌లో దౌర్జన్యం చేసి అద్దాలు పగులకొట్టారు. దీంతో జోగి రమేశ్ భార్య శకుంతల ఏ1, కుమారుడు రాజీవ్ ఏ2, మరో కుమారుడు రోహిత్ ఏ3గా మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు.

News November 3, 2025

RTC బస్సులకు కెపాసిటీ లిమిట్ రూల్ ఉండదా?

image

ప్రైవేట్ బస్సుల్లో సీటింగ్ కెపాసిటీకి మించి ఒక్కరు ఎక్కువున్నా RTA ఫైన్లు విధిస్తుంది. మీర్జాగూడ ప్రమాదంతో ఇదే రూల్ RTC బస్సులకు వర్తించదా? అనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. RTC సర్వీసుల్లో చాలా రూట్లలో, చాలా సమయాల్లో సీట్లు నిండి లోపల కాలు పెట్టలేనంతగా ప్రయాణికులతో నిండి ఉంటాయి. దీనికి తక్కువ బస్సులు, ప్రజల అవసరాలు లాంటివి కారణం కావచ్చు. కానీ RTCకి ఓవర్ లోడ్ పరిమితి ఉందా? అనేదే అందరి ప్రశ్న.