News January 30, 2025

MBNR: తల్లి మృతి.. తల్లడిల్లిన పిల్లలు

image

WNP జిల్లా మదనాపురం మండలం దుప్పల్లిలో బుధవారం రమేశ్ నాయక్ భార్య కేత్లావత్ శాంతమ్మ(30) మృతి కలకలం రేపిన విషయం తెలిసిందే. స్థానికులు తెలిపిన వివరాలు.. వలస కూలిగా వెళ్లిన శాంతమ్మ కరీంనగర్‌లో జరిగిన గొడవ కారణంగా మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. మృతురాలికి కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. చిన్నవయసులోనే తల్లిని కోల్పోయిన ఆ పిల్లలు గుండెలవిసేలా రోదించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Similar News

News November 1, 2025

సానుభూతితో ఓట్లు దండుకోవాలనేది BRS యత్నం: రేవంత్

image

TG: జూబ్లీహిల్స్‌లో సానుభూతితో ఓట్లు దండుకోవాలని BRS ప్రయత్నిస్తోందని CM రేవంత్ ఆరోపించారు. ‘2007లో PJR చనిపోతే ఏకగ్రీవం కాకుండా అభ్యర్థిని నిలబెట్టే సంప్రదాయానికి KCR తెరదీశారు. పదేళ్ల పాటు మైనార్టీ సమస్యలు పట్టించుకోలేదు. మా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి 70వేల ఉద్యోగాలిచ్చాం. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలిని ఇంటి నుంచి పంపిన KTR.. సునీతను బాగా చూసుకుంటారా?’ అని విమర్శించారు.

News November 1, 2025

KNR: అధ్యయనం చేస్తూ.. మెలుకువలు నేర్చుకుంటున్న విద్యార్థులు

image

రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని బాబు జగ్జీవన్‌ రావు వ్యవసాయ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులు శంకరపట్నం మొలంగూర్ ఇండస్ట్రియల్ ఏరియాలోని కావేరి సీడ్ ప్లాంట్‌ను సందర్శించారు. ఈ సందర్శనలో విత్తన ఉత్పత్తి, ప్రాసెసింగ్, ప్యాకింగ్, నాణ్యత, నిల్వ వంటి అంశాలపై విద్యార్థులు నేరుగా పరిశీలించి, మెలుకువలు నేర్చుకున్నారు. క్షేత్రస్థాయి పరిశోధనలు, శిక్షణలో భాగంగా ఈ సందర్శన జరిగిందని వారు తెలిపారు.

News November 1, 2025

HZB: ‘ఆడపిల్ల పుడితే ఆనందంగా స్వాగతించాలి’

image

‘బేటీ బచావో – బేటీ పడావో’, లింగ నిర్ధారణ చట్టంపై శనివారం హుజురాబాద్ మున్సిపల్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కరీంనగర్ అదనపు కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాకడే అధ్యక్షత వహించారు. పురుషులతో పోలిస్తే మహిళల శాతం తగ్గడం ఆందోళనకరమన్నారు. లింగభేదం లేకుండా సమానత్వం పాటిస్తే సమాజానికి మంచిదని, ఆడపిల్ల పుట్టినప్పుడు ఆనందంగా స్వాగతించే భావన పెరగాలని ఆమె పిలుపునిచ్చారు.