News March 20, 2024

MBNR: తాగునీటి సమస్యల పరిష్కారానికి ఈ నెంబర్ ఫోన్ చేయండి!

image

తాగునీటి(భగీరథ) సరఫరాలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించేందుకు హెల్ప్ లైన్ ఏర్పాటు చేస్తున్నామని మహబూబ్‌నగర్ సర్కిల్ ఎస్ఈ వెంకటరమణ తెలిపారు. MBNR, NGKL, NRPT జిల్లాల ప్రజలు హెల్ప్‌లైన్ నంబర్ 08542-242024ను సంప్రదించాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారన్నారు. సరఫరాలో అంతరాయం, లోపాలు, లీకేజీల సమస్యలు తెలియజేయొచ్చని తెలిపారు.

Similar News

News October 28, 2025

MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నిందితులు వీరే

image

MBNR(D) మాచారం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధిలో గంజాయి విక్రయంపై పోలీసులు దాడి నిర్వహించారు. నిందితులు 1.మరికంటి సుమంత్ రెడ్డి(MBNR),2.అబ్దుల్ రెహమాన్(MBNR),3.శుభోద్ కాంత్ శర్మ(బీహార్),4.సత్తు యాదవ్ కుమార్(బిహార్) గంజాయి కొనుగోలు,విక్రయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు నిర్ధారణ కావడం వల్ల దాడి చేసి అరెస్టు చేశారు. దీంతో RNCC యూనిట్, ఈగల్ టీం,SI ఖాదర్, పోలీస్ సిబ్బందిని SP ప్రశంసించారు.

News October 28, 2025

MBNR: సౌత్ జోన్.. PU కబడ్డీ జట్టు READY

image

సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్లో పాల్గొనేందుకు పాలమూరు వర్సిటీ స్త్రీల కబడ్డీ జట్టు చెన్నైలోని వినాయక మిషన్ ఫౌండేషన్ వర్సిటీకి బయలుదేరింది. వర్సిటీ వైస్ ఛాన్స్‌లర్ ప్రొ.జిఎన్ శ్రీనివాస్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు అందజేశారు. యూనివర్సిటీకి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. రిజిస్ట్రార్ రమేష్ బాబు, ఫిజికల్ డైరెక్టర్ వై.శ్రీనివాసులు, కోచ్ వెంకటేష్, మేనేజర్ ఉష పాల్గొన్నారు.

News October 27, 2025

MBNR: గంజాయి విక్రయంపై దాడి.. నలుగురి అరెస్ట్

image

మహబూబ్‌నగర్ RNCC యూనిట్, ఈగల్ టీం, జడ్చర్ల పోలీసుల సంయుక్తంగా మాచారం గ్రామం (NH–44 హైవే వద్ద) జడ్చర్ల టౌన్ PS పరిధి గంజాయి విక్రయంపై ప్రత్యేక దాడి నిర్వహించింది. జడ్చర్ల టౌన్ CI కమలాకర్ వివరాల ప్రకారం.. గంజాయి విక్రయంపై దాడిలో నలుగురు వ్యక్తులు అరెస్ట్ చేశామని, వారి నుంచి మొత్తం 241 గ్రాముల గంజాయి, 4 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో హాజరు పరచామన్నారు.