News March 18, 2025
MBNR: తాగునీటి సరఫరాపై దృష్టి పెట్టండి: కలెక్టర్

వేసవిని దృష్టిలో ఉంచుకుని తాగునీటికి ఇబ్బందులు రాకుండా చూడాలని కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. సోమవారం ఆమె ఛాంబర్‌లో తాగునీరు, విద్యుత్ సమస్యపై సమీక్షించారు. తాగునీటికి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. అదేవిధంగా విద్యుత్ సమస్య రాకుండా ముందస్తుగా చర్యలు చేపట్టాలన్నారు.
Similar News
News April 25, 2025
‘MBNR జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు వేగవంతం చేయండి’

ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి ఆదేశించారు. గురువారం కోయిలకొండ మండలంలో రైతు వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలించారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో గన్నీ సంచులు ఉన్నాయా పరిశీలించి తెలుసుకున్నారు. అలాగే ధాన్యం తేమ శాతాన్ని పరిశీలించారు.
News April 24, 2025
MBNR: 12 వందల ఏళ్ల క్రితం నాటి శివలింగం చరిత్ర ఇదే.!

దాదాపు 12 వందల ఏళ్ల క్రితం కాకతీయుల రాజప్రతినిధులు గోన గన్నారెడ్డి పరిపాలిస్తున్న కాలంలో అడ్డాకుల మండలం రాచాలలో వెలసిన దివ్యక్షేత్రం రామలింగేశ్వర స్వామి ఆలయం నిర్మించబడినట్లు గ్రామస్థులు చెబుతున్నారు. స్వామివారి లింగం, ఆలయ నిర్మాణ శైలి సైతం కాకతీయుల నిర్మాణాలను పోలి ఉండటం, కందూరు గ్రామ శాసనాలలో ఆలయ ప్రస్తావన ఉండటం ఇందుకు సాక్ష్యంగా పరిశీలకులు పరిగణిస్తున్నారు.
News April 24, 2025
తుపాకీ గురిపెట్టిన MBNR ఎమ్మెల్యే

ఏనుగొండలో మల్టీ స్పోర్ట్స్ ఏరియాను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిర్ ఫిస్టల్ షూటింగ్ గురించి ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ ఫిస్టల్‌ను ఎమ్మెల్యే తన చేతులతో ఎక్కుపెట్టి ఉత్సాహపరిచారు. అన్ని క్రీడలు ఒకే దగ్గర అందుబాటులో ఉంచడం పట్ల నిర్వాహకులను ఎమ్మెల్యే అభినందించారు. పట్టణ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.