News October 6, 2024

MBNR: ‘తెలంగాణ వచ్చి పదేళ్లు దాటిన కేసులో మాఫీ కాలే’

image

రాష్ట్రం ఏర్పడి పదేళ్లు దాటినప్పటికీ ఉద్యమంలో నమోదైన కేసులు ఇప్పటికి మాఫీ కాలేదని మహబూబ్ నగర్ టీఎన్జీవో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రనాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. యూనియన్ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సకల జనుల సమ్మె సందర్భంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఉద్యమకారులపై కేసులు నమోదు చేశారని ఆయన గుర్తు చేశారు.

Similar News

News December 12, 2025

MBNR: వాహనదారులు, ప్రజలకు భద్రతా సూచనలు: ఎస్పీ

image

మహబూబ్‌నగర్ జిల్లాలో శీతాకాలం తీవ్రం కావడంతో రాత్రి, తెల్లవారుజామున పొగమంచు అధికంగా ఏర్పడుతోంది. దీంతో విజిబిలిటీ తగ్గి ప్రమాదాలు పెరుగుతాయని జిల్లా ఎస్పీ డి.జానకి హెచ్చరించారు. ఉదయం 5 నుంచి 8, రాత్రి 8 గంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని, వాహనదారులు, వాకింగ్ చేసేవారు జాగ్రత్తలు పాటించాలని కోరారు.

News December 12, 2025

MBNR : భూత్పూర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

image

మహబూబ్‌నగర్ జిల్లాలో వారం రోజులుగా చలి తీవ్రత గణనీయంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో భూత్పూర్‌లో 9.4 డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదైంది. సిరి వెంకటాపుర్ 9.7°C, దోనూరు 9.8°C, పారుపల్లి 10.4°C ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. తీవ్రమైన చలి కారణంగా వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారు.

News December 12, 2025

MBNR జిల్లాలో FINAL పోలింగ్ శాతం

image

MBNR జిల్లాలో 139 గ్రామ పంచాయతీల్లో గురువారం మొదటి విడత ఎన్నికలు జరిగాయి. కాగా మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగియగా సమయానికి కేంద్రంలోపలికి వచ్చి క్యూలైన్‌లో నిలబడిన వారందరికీ ఓటేసేందుకు అధికారులు అవకాశం కల్పించారు. దీంతో జిల్లాలో ఫైనల్‌గా 83.04 శాతం పోలింగ్ నమోదైందని అధికారులు ప్రకటించారు.