News July 19, 2024

MBNR: తొలి మ్యాచ్‌లో మన పాలమూరు జట్టు ఘన విజయం

image

HCA ఏ1 డివిజన్ 3డే లీగ్ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఉమ్మడి మహబూబ్ నగర్ జట్టు సాయి సత్య క్రికెట్ క్లబ్(సికింద్రాబాద్) జట్టుపై 204 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి త్రీడే విజయం సాధించిన జిల్లా జట్టును ఎండీసీఏ ప్రధాన కార్యదర్శి ఎం.రాజశేఖర్, ఉమ్మడి జిల్లా అధికారులు అభినందించారు. 64 పరుగులు చేసిన షాదాబ్‌కు సంఘం కోశాధికారి ఉదేశ్ కుమార్ రూ.20వేలు విలువ చేసే బ్యాట్‌ను ప్రదానం చేశారు. ♥CONGRATULATIONS

Similar News

News October 2, 2024

MBNR: మండలాల వారిగా తుది ఓటర్ల సంఖ్య ఇలా..!

image

1.MBNR(రూరల్)-36,864, 2.అడ్డాకుల-24,147,
3.బాలానగర్-32,912,
4.రాజాపూర్-21,599,
5.నవాబ్ పేట-52,708,
6.మూసాపేట-21,305,
7.మిడ్జిల్-24,770,
8.కోయిల్ కొండ-50,845,
9.జడ్చర్ల-40,237,
10.హన్వాడ-39,417,
11.గండీడ్-61,608,
12.దేవరకద్ర-45,956,
13.సీసీ కుంట-37,474, 14.భూత్పూర్-26,359 మంది ఓటర్లు ఉన్నారు. జిల్లాలోని 441 గ్రామ పంచాయతీల పరిధిలో 3,836 వార్డులు ఉండగా.. మొత్తం 5,16,183 మంది ఓటర్లు ఉన్నారు.

News October 2, 2024

‘పాలమూరు సీతాఫలాలకు జాతీయస్థాయిలో మంచి గుర్తింపు’

image

ఉమ్మడి పాలమూరు సీతాఫలాలకు వివిధ రాష్ట్రాలలో మంచి డిమాండ్ ఉంది. కొల్లాపూర్ మామిడితో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన పాలమూరులో పండే సీతాఫలాలకు సైతం అదే స్థాయిలో గుర్తింపు వస్తోంది. ఈ ప్రాంతంలో ఉన్న అడవులు, వాతావరణం, వర్షపాతం తదితర కారణాలవల్ల సీతాఫలాలు మధురంగా ఉండడమే కాదు.. ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ కీలక పాత్ర పోషిస్తాయని ప్రచారం జరుగుతుండడంతో జాతీయస్థాయిలో పాలమూరు సీతాఫలాలకు మంచి గుర్తింపు లభిస్తుంది.

News October 2, 2024

జూరాలలో 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి

image

జూరాల ఎగువ, దిగువ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల్లో మంగళవారం 11 యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తిని చేపడుతున్నామని అధికారులు తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుదుత్పత్తిని కొనసాగుతుందన్నారు. ఇప్పటి వరకు 408.108 మిలియన్ యూనిట్ల విద్యుదుత్పత్తిని సాధించామని తెలిపారు.